Apple iPhone 13 Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ (Apple iPhone 13) ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో రూ. 9,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, బేస్ వేరియంట్ రూ. 62,999కి అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ కార్డ్‌లను కలిగిన కస్టమర్లు అదనంగా రూ. 2వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 69,900 నుంచి తగ్గి రూ. 60,999కి అందుబాటులో ఉంది. ఈ డీల్ లాభదాయకంగా ఉన్నా మీరు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలా వద్దా? iPhone 14 కోసం వేచి చూడాలా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
భారత మార్కెట్లో ఆపిల్ iPhone 14 ధర విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ అదే 128GB స్టోరేజీకి రూ.72,999కి విక్రయిస్తోంది. రూ. 79,900తో మార్కెట్లో అందుబాటులో ఉంది. మీరు ఏ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలన్నా ఐఫోన్ 14, ఐఫోన్ 13 రెండూ లుక్ పరంగా ఒకే విధంగా ఉంటాయి. ఐఫోన్ 14 కెమెరాలకు కూడా బెస్ట్ ఆప్షన్. అయినప్పటికీ, రాబోయే క్రియేటర్లకు iPhone 13 అద్భుతమైనదిగా చెప్పవచ్చు. అలాంటప్పుడు, మీకు సరసమైన ఐఫోన్ కావాలంటే ఆపిల్ iPhone 13 బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను పొందాలనుకుంటే..iPhone 14 మోడల్ కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 13తో పోలిస్తే.. ఐఫోన్ 14 ఏడాదిలో iOS అప్డేట్ కలిగి ఉంటుంది. తద్వారా ఫోన్ లైఫ్‌ను కూడా పెంచుతుంది.
ఐఫోన్ 13 కొనేందుకు సరైన సమయమా వేచి ఉండాలా? :
ప్రస్తుత ధరలో iPhone 13 (బ్యాంక్ ఆఫర్‌తో) బెస్ట్ ఆప్షన్ అనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart)లో iPhone ధరలు హెచ్చుతగ్గులు ఉంటాయి. కొన్నిసార్లు స్టాక్‌లు ప్రత్యేకించి సేల్ సీజన్లో ఉండవు. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద సేల్స్ ఈవెంట్లు ఏవీ లేవు, ఐఫోన్ 13 రూ. 60,999కి రావడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ప్రస్తుత ఐఫోన్ సేల్ ధరను కూడా తగ్గించవచ్చు. మీరు పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా కస్టమర్లు సుమారు రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ కొత్తది (ఐఫోన్ 12), మంచి వర్క్ కండిషన్లో ఉంటే.. ఎక్సేంజ్ వాల్యూ పెరుగుతుంది.
మరోవైపు, ఆండ్రాయిడ్ ఫోన్లు ఎక్కువ ఎక్స్ఛేంజ్ ధరను పొందలేరని గమనించాలి. ఐఫోన్ 13 చాలా తక్కువ ధరకు పొందాలంటే.. సేల్ సమయంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, సెప్టెంబర్ 2022లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ ఈవెంట్ సందర్భంగా అత్యల్ప సేల్ ధర రూ. 47,990గా ఉంది. నిమిషాల వ్యవధిలోనే ఈ ఫోన్ అమ్ముడుపోయింది. ప్రైస్ ట్రాకర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ప్రకారం.. ఐఫోన్ 13 ధర రూ. 60వేలకు కన్నా తగ్గలేదు. ఆ తర్వాత సేల్ సమయంలో ఈ ఫోన్ పెద్ద తగ్గింపు పొందవచ్చు. మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ సేల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.