Apple iPhone 14 available at Rs 27,499 on Amazon
Apple iPhone 14 Sale : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం పండుగ సేల్స్ ముగిసినప్పటికీ ఆపిల్ ఐఫోన్ 14 ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పోలిస్తే.. అమెజాన్‌లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అత్యధికంగా అమ్ముడవుతున్న ఆపిల్ ఐఫోన్లలో ఐఫోన్ 14 మోడల్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ సందర్భంగా ఈ మోడల్‌కు అద్భుతమైన స్పందన లభించింది.
Read Also : Apple iPhone RAM : మీ ఆపిల్ ఐఫోన్ స్లో అయిందా? ర్యామ్ ఎలా క్లియర్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!
అయితే, సేల్ ముగిసినందున ఐఫోన్ 14 అమెజాన్‌లో చౌకైన ధరకు లభిస్తోంది. ఐఫోన్ 14, ఐఫోన్ 13 మాదిరిగా చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కానీ, మరిన్ని కోర్ అప్‌డేట్స్‌తో ఐఫోన్ 14 గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో ప్లస్‌తో పాటు రూ. 79,900 ప్రారంభ ధరతో వచ్చింది. అదేవిధంగా ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత ఐఫోన్ 14 ఇటీవల రూ. 10వేల ధర తగ్గింపును అందుకుంది.
పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై మరింత తగ్గింపు :
ప్రస్తుతం అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 14 అధికారిక స్టోర్ ధర రూ. 7,901 తగ్గింపు తర్వాత రూ. 61,999 వద్ద అందుబాటులో ఉంది. అంతేకాదు.. అమెజాన్‌లో మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 34,500 వరకు తగ్గింపును అందిస్తోంది. అన్ని ఆఫర్లు, తగ్గింపులతో అమెజాన్ నుంచి ఐఫోన్ 14ని కేవలం 27,499 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. అదే ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14ని అన్ని ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో కలిపి రూ. 58,999కి కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14 వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 12ఎంపీ కెమెరాను కలిగి ఉంది. ఐఫోన్ 13-వంటి నాచ్‌తో ఫ్రంట్ సైడ్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్సడీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ ఈ ఐఫోన్ 12ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ సమయంలో డిస్కౌంట్ పొందిన తర్వాత ఐఫోన్ 14 కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది. సరసమైన ధరలో ఐఫోన్ 14 కొనుగోలు చేయగల అత్యుత్తమ ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే అమెజాన్‌లో ఐఫోన్ 14 కొనేసుకోండి.
Apple iPhone 14 Sale Offers
డిస్‌ప్లే : హెచ్‌డీఆర్10తో 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, డాల్బీ విజన్, 1,200 నిట్స్ గరిష్ట ప్రకాశం, 1170 x 2532 పిక్సెల్‌లు
కెమెరా : 12ఎంపీ+ 12ఎంపీ బ్యాక్ 12ఎంపీ ఫ్రంట్ కెమెరా
సాఫ్ట్‌వేర్ : ఐఓఎస్ 16, ఐఓఎస్ 17కి అప్‌గ్రేడబుల్
ప్రాసెసర్ : ఎ15 బయోనిక్ (5ఎన్ఎమ్)
స్టోరేజీ : 128/256/512జీబీ
ఛార్జింగ్ : లైట్నింగ్ పోర్ట్, 20డబ్ల్యూ వైర్డు, 15డబ్ల్యూ వైర్‌లెస్, 7.5డబ్ల్యూ క్యూఐ ఛార్జింగ్
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 14 ధర ఎంతంటే? :
* ఆపిల్ ఐఫోన్ 14 మోడల్ 128జీబీ : రూ. 69,900
* ఆపిల్ఐ ఫోన్ 14 సిరీస్ 256జీబీ : రూ. 79,900
* ఆపిల్ ఐఫోన్ 14 మోడల్ 512జీబీ : రూ. 99,900
Read Also : Apple iPhone 16 : అద్భుతమైన ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ 16 వచ్చేస్తోంది.. కొత్త లీక్ డేటా ఇదిగో..!