Apple iPhone RAM : మీ ఆపిల్ ఐఫోన్ స్లో అయిందా? ర్యామ్ ఎలా క్లియర్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!

Apple iPhone : మీ ఆపిల్ ఐఫోన్ డివైజ్ స్లో అయిందా? అయితే ర్యామ్ సమస్య కారణం కావచ్చు. డేటాతో స్టోరేజీతో నిండిన ర్యామ్ క్లియర్ చేయాలంటే ఈ టెక్ టిప్స్ తప్పక పాటించండి.

Apple iPhone RAM : మీ ఆపిల్ ఐఫోన్ స్లో అయిందా? ర్యామ్ ఎలా క్లియర్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!

How to clear RAM on your Apple iPhone, Check Full Details

Apple iPhone RAM : మీ ఆపిల్ ఐఫోన్ స్లో అయిందా? అందుకు కారణం ఏంటో తెలుసా? ఐఫోన్ ర్యామ్ మెమెరీ నిండిపోయినప్పుడు ఇలా జరుగుతుంటుంది. RAM (రాండమ్ యాక్సెస్ మెమరీ) అనేది ఒక రకమైన కంప్యూటర్ మెమరీ, ప్రస్తుతం ప్రోగ్రామ్ ద్వారా ఉపయోగించే డేటాను స్టోర్ చేస్తుంది. మీ ఐఫోన్‌లో యాప్‌ను ఓపెన్ చేసినప్పుడు ర్యామ్ లోడ్  అవుతుంది. తద్వారా మీ డేటా సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

అయితే, మీరు ఒకేసారి చాలా యాప్‌లను ఓపెన్ చేసి ఉంటే.. మీ ఐఫోన్‌లో ర్యామ్ బాగా నెమ్మదిస్తుంది. ఐఫోన్‌లో ర్యామ్‌ను నేరుగా క్లియర్ చేయలేమని గుర్తుంచుకోండి. మీరు కొంత మెమరీని ఖాళీ చేయడానికి సాఫ్ట్ రీసెట్ లేదా మాన్యువల్ రీస్టార్ట్ చేయవచ్చు. సాఫ్ట్ రీసెట్ ప్రస్తుతం ఓపెన్ చేసి ఉన్న అన్ని యాప్‌లను క్లోజ్ చేస్తుంది. మాన్యువల్ రీస్టార్ట్ ఆప్షన్ ద్వారా మీ ఐఫోన్ ఆఫ్ చేసి, ఆపై తిరిగి ఆన్ చేయాల్సి ఉంటుంది.

Read Also : Xiaomi SU7 Sedan Launch : ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి షావోమీ ఎంట్రీ.. కొత్త SU7 సెడాన్ కారు చూశారా? పూర్తి వివరాలు మీకోసం..!

సాఫ్ట్ రీసెట్ ఎలా చేయాలంటే? :
* సైడ్ బటన్, వాల్యూమ్ బటన్‌ను నొక్కి పట్టుకోండి.
* స్లయిడ్ టు పవర్ ఆఫ్ స్లయిడర్ కనిపించినప్పుడు బటన్‌లను రిలీజ్ చేయండి.
* మీ ఐఫోన్ రీస్టార్ట్ అయ్యే వరకు సైడ్ బటన్‌ను మళ్లీ ట్యాప్ చేసి పట్టుకోండి.

మాన్యువల్ రీస్టార్ట్ చేయడం ఎలా? :
* Settings  > General ఆప్షన్‌కు వెళ్లండి.
* కిందికి స్క్రోల్ చేయండి. షట్‌డౌన్ ట్యాప్ చేయండి.
* మీ ఐఫోన్ ఆఫ్ చేసేందుకు స్లయిడ్‌ని పవర్ ఆఫ్ స్లయిడర్‌కి లాగండి.
* మీ ఐఫోన్ పూర్తిగా స్టాప్ అయ్యే వరకు వేచి ఉండండి.
* ఆపై ఆపిల్ లోగో కనిపించే వరకు సైడ్ బటన్‌ను నొక్కి పట్టుకోండి.
* ఐఫోన్ ర్యామ్‌ను ఎప్పుడు క్లియర్ చేయాలి.
* మీరు యాప్‌ క్రాష్ కావడం లేదా మీ ఐఫోన్ స్లో కావడం వంటి సమస్యలను ఎదుర్కొవచ్చు.

How to clear RAM on your Apple iPhone, Check Full Details

How to clear RAM on your Apple iPhone 

మీ ఐఫోన్‌లో ర్యామ్ క్లియర్ చేయాలి. మీకు ఏవైనా సమస్యలు లేకుంటే ర్యామ్ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఐఫోన్ ర్యామ్ ఆటోమాటిక్‌గా మేనేజ్ చేస్తుంది. మీరు మాన్యువల్‌గా చేయాల్సిన పనిలేదు. అయినప్పటికీ, మీకు సమస్యలు ఉన్నట్లయితే పైన సూచించిన విధంగా ఫాలో చేయడం వల్ల కొంత మెమరీని ఖాళీ చేయొచ్చు. తద్వారా డివైజ్ పర్ఫార్మెన్స్ మెరుగువుతుంది.

ఈ టిప్స్ అసలు మిస్ చేయవద్దు :
* మీరు ఉపయోగించని యాప్‌లను క్లోజ్ చేయండి.
* ఒకేసారి చాలా యాప్‌లను ఓపెన్ చేయడం మానుకోండి.
* మీ ఐఫోన్‌ను క్రమం తప్పకుండా రీస్టార్ట్ చేయండి.
* మీకు ఇంకా సమస్యలు ఉంటే.. ఆపిల్ సపోర్టును సంప్రదించవలసి ఉంటుంది.

Read Also : iPhone 14 Users : ఐఫోన్ 14 యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ శాటిలైట్ సర్వీసు మరో ఏడాది ఉచితంగా పొందవచ్చు!