Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్ ధర భారీగా తగ్గిందోచ్.. కేవలం రూ. 24 వేలకే సొంతం చేసుకోండి!

Apple iPhone 14 Plus : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ సిరీస్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌ ధర భారీగా తగ్గింది. రూ.40వేల విలువైన ఐఫోన్ రూ.24,599 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 14 Plus available at just Rs 24,599 on Flipkart

Apple iPhone 14 Plus : ఆపిల్ కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. ఆపిల్ సొంత బ్రాండ్ ఐఫోన్ సిరీస్‌లో ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus Price Cut)  ధర భారీగా తగ్గింది. ఐఫోన్ (iPhone 15 Plus) లాంచ్ చేసిన తర్వాత (Apple iPhone 14 Plus) చివరకు తగ్గింపు పొందింది. ఐఫోన్ 15 సిరీస్ గత నెలలో లాంచ్ కాగా.. ఐఫోన్ 15 ప్లస్ గత వెర్షన్ల కన్నా ఎక్కువ క్రేజ్ ఉంది. ఐఫోన్ 15 ప్లస్ క్రేజ్ కారణంగా ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో కస్టమర్ల నుంచి ఆదరణ పొందుతోంది.

ఐఫోన్ 14 ప్లస్ తగ్గిన ధర ఎంతంటే? :

ఐఫోన్ 14 ప్లస్ మోడల్ బ్లూ, పర్పుల్, మిడ్‌నైట్, స్టార్‌లైట్, రెడ్ అనే 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 14 ప్లస్ బేస్ మోడల్ ధర రూ. 89,900తో లాంచ్ అయింది. ఐఫోన్ 15 ప్లస్ లాంచ్ తర్వాత, కంపెనీ ఐఫోన్ ధరను రూ. 10వేలకు తగ్గించింది. భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధర ఇప్పుడు రూ.79,900 నుంచి అందుబాటులో ఉంది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 14 ప్లస్ ధర రూ. 40,400 తగ్గింపు తర్వాత కేవలం రూ. 24,599కి అందుబాటులో ఉంది.

Read Also : iPhone 14 Price Cut : ఐఫోన్ 15 ఇలా వచ్చిందంతే.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 సిరీస్ ధరలు.. ఏ మోడల్ ధర ఎంతో తెలుసా?

మరెన్నో బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లు :

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధర రూ. 14,901 తగ్గింపు తర్వాత రూ. 64,999కి లిస్టు అయింది. ఈ ఐఫోన్ కొటక్ బ్యాంక్, SBI, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై కొనుగోలుదారులు రూ. 1250 తగ్గింపును పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.63,749కి తగ్గింది. కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 39,150 వరకు తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అన్ని ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌లతో, కొనుగోలుదారులు ఐఫోన్ 14 ప్లస్‌ను రూ. 44,400 తగ్గింపు తర్వాత కేవలం రూ. 24,599కి సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 14 Plus on Flipkart

సింగిల్ ఛార్జ్‌తో 26 గంటల ఛార్జింగ్ :
ఆపిల్ ఐఫోన్ 13 ప్రో మోడల్‌లలో కనిపించే విధంగా ఐఫోన్ 14 ప్లస్ మెరుగైన A15 బయోనిక్ చిప్‌తో ఆధారితమైనది. కెమెరాల విషయానికి వస్తే.. ఐఫోన్ 14 ప్లస్ 12MP ప్రధాన సెన్సార్, అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14 ప్లస్ 5G సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. స్మార్ట్‌ఫోన్ 26 గంటల వరకు ఉంటుందని ఆపిల్ పేర్కొంది. ఐఫోన్ సిరీస్‌లోని మినీ మోడల్‌కు బదులుగా ఐఫోన్ 14 ప్లస్‌ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 పెద్ద డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Read Also : iPhone 14 Plus Price Cut : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ. 20వేలకు పైగా తగ్గింపు!

ట్రెండింగ్ వార్తలు