iPhone 14 Price Cut : ఐఫోన్ 15 ఇలా వచ్చిందంతే.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 సిరీస్ ధరలు.. ఏ మోడల్ ధర ఎంతో తెలుసా?

iPhone 14 Price Cut : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ లాంచ్ అయిన వెంటనే ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌ ధరలు భారీగా తగ్గాయి. ఆపిల్ అభిమానులు తమకు నచ్చిన ఐఫోన్ మోడల్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

iPhone 14 Price Cut : ఐఫోన్ 15 ఇలా వచ్చిందంతే.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 సిరీస్ ధరలు.. ఏ మోడల్ ధర ఎంతో తెలుసా?

iPhone 14 and iPhone 14 Plus get big price cut after iPhone 15 launch, turn into the best value iPhones

iPhone 14 Price Cut : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌ ధరలపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఐఫోన్‌ కొనుగోలుపై ఆపిల్ వాండర్‌లస్ట్ ఈవెంట్‌ (Wanderlust Event)లో ఆవిష్కరించిన వెంటనే పాత ఐఫోన్ల మోడల్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. అందులో ప్రధానంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడల్ ధరలు ఒక్కసారిగా తగ్గాయి. అదే సమయంలో ఐఫోన్ 15 లైనప్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్‌తో పాటు ఆపిల్ వాచ్ 9, ఆపిల్ వాచ్ అల్ట్రా 2లను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.

Read Also : Apple iPhone 13 mini : ఆపిల్ ఐఫోన్ 13 మినీ ఇక కనిపించదా? ఐఫోన్ 15 లాంచ్ తర్వాత పూర్తిగా నిలిచిపోనుందా? ఇదే చివరి అవకాశం..!

ఆపిల్ కొత్త ప్రొడక్టులు అతి త్వరలో భారత మార్కెట్లోకి రానున్నాయి. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. (iPhone 14) 128GB వేరియంట్ ధర రూ.69,900కి తగ్గింది. ఐఫోన్ 14 ఎంట్రీ-లెవల్ వేరియంట్ అసలు ధర రూ.79,900గా ఉంది. అదేవిధంగా, ఐఫోన్ ప్లస్ 128GB వేరియంట్ ధర కూడా రూ.89,900 నుంచి రూ.79,900కి తగ్గింది.

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్‌లు.. :
ఆపిల్ ఐఫోన్ 14 పవర్‌ఫుల్ డివైజ్.. ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుంది. స్లిమ్ బెజెల్స్‌తో కూడిన 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. డిస్‌ప్లే వైడ్ రేంజ్ కలర్ ఆప్షన్లను చూడగలదు. HDR కంటెంట్‌కు సపోర్టు ఇస్తుంది. అదే సమయంలో 1200-నిట్ ప్రకాశంతో పవర్‌ఫుల్ అందిస్తుంది. ఈ డివైజ్ అన్‌లాకింగ్ ఫేస్ ID సెన్సార్‌లను కూడా కలిగి ఉంటుంది.

iPhone 14 and iPhone 14 Plus get big price cut after iPhone 15 launch, turn into the best value iPhones

iPhone 14 and iPhone 14 Plus get big price cut after iPhone 15 launch, turn into the best value iPhones

ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 మాదిరిగా ఉంటుంది. కానీ, అందులో ఒక పెద్ద తేడా ఉంది. రెండు ఫోన్ల డిస్‌ప్లే మధ్య పరిమాణంలో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. ఐఫోన్ 14 ప్లస్ పెద్ద 6.7-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేతో వస్తుంది. ఐఫోన్ 14 Pro Max పరిమాణంలో ఉంటుంది. కానీ, మరో టైప్ నాచ్‌తో ఉంటుంది. ఇక, ప్రో మాక్స్ వైడ్ నాచ్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14 ప్లస్ డైనమిక్ ఐలాండ్ స్టైల్ నాచ్‌ను కలిగి ఉంది. మీరు పెద్ద స్క్రీన్‌తో ఐఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదని భావిస్తే.. ఐఫోన్ 14 ప్లస్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

డివైజ్ హుడ్ కింద, ఐఫోన్ 14 ప్లస్ A15 బయోనిక్ చిప్ మెరుగైన వెర్షన్‌తో రన్ అవుతుంది. మొత్తం ఐఫోన్ 13 లైనప్‌లో కూడా వస్తుంది. మీరు వేగవంతమైన పర్ఫార్మెన్స్, మృదువైన ఆపరేషన్‌ను అందిస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఐఫోన్ 14 ప్లస్ 12MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 14 కెమెరా పర్ఫార్మెన్స్ గత మోడల్‌ల కన్నా మెరుగ్గా ఉందని పేర్కొంది. మీరు గొప్ప ఫొటోలు, వీడియోలను సులభంగా క్యాప్చర్ చేయవచ్చు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ రెండూ iOS ముందే ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

Read Also : Apple iPhone 15 Pro : ఆపిల్ కొత్త ఐఫోన్లు వచ్చేశాయి.. ఈ ఐఫోన్ 15 సిరీస్‌‌లో స్పెషాలిటీ ఇదే.. ఫీచర్లలో తగ్గేదే లే..!