Apple iPhone 15 Pro : ఆపిల్ కొత్త ఐఫోన్లు వచ్చేశాయి.. ఈ ఐఫోన్ 15 సిరీస్‌‌లో స్పెషాలిటీ ఇదే.. ఫీచర్లలో తగ్గేదే లే..!

Apple iPhone 15 Pro Launch : ఆపిల్ కొత్త ఐఫోన్లు చూశారా? అత్యాధునిక ఫీచర్లతో ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Apple iPhone 15 Pro : ఆపిల్ కొత్త ఐఫోన్లు వచ్చేశాయి.. ఈ ఐఫోన్ 15 సిరీస్‌‌లో స్పెషాలిటీ ఇదే.. ఫీచర్లలో తగ్గేదే లే..!

iPhone 15 Pro, iPhone 15 Pro Max with 3nm A17 Pro Chip, Action Button Launched in India_ Price, Specifications

Apple iPhone 15 Pro Launch : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్‌లను ఆపిల్ కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ (Apple Park) నుంచి కంపెనీ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. హుడ్ కింద, ఈ హ్యాండ్‌సెట్‌లు కంపెనీ అత్యాధునిక A17 ప్రో చిప్‌సెట్‌తో వచ్చాయి. ఆపిల్ వాచ్ అల్ట్రా (Apple Watch Ultra)లో కనిపించేలా ప్రోగ్రామబుల్ యాక్షన్ బటన్‌తో ఉంటాయి. iPhone 15 Pro, iPhone 15 Pro Max మోడల్‌లు గత వెర్షన్ల మాదిరిగా కాకుండా USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉన్నాయి. ఇందులో, టాప్-ఆఫ్-లైన్ మోడల్ మెరుగైన జూమ్ పర్ఫార్మెన్స్ పెరిస్కోప్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Read Also : Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 ఈరోజే లాంచ్.. భారత్‌‌లో తయారైన ఈ ఐఫోన్ ధర తక్కువగా ఉంటుందా?

ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మాక్స్ ధరలివే :
కొత్త ఐఫోన్ 15 ప్రో బేస్ 128GB వేరియంట్‌ ప్రారంభ ధర రూ. 1,34,900, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ.1,59,900 (256GB)కి కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లు 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త ఐఫోన్ల ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. ఐఫోన్‌లు సెప్టెంబర్ 22 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. iPhone 15 Pro, iPhone 15 Pro Max బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం ఎండ్‌లో విక్రయించనున్నట్టు ఆపిల్ తెలిపింది.

టైటానియం ఫ్రేమ్, కొత్త యాక్షన్ బటన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఇవే :
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్పోర్ట్ 6.1-అంగుళాల, 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేలు, ఆపిల్ సిరామిక్ షీల్డ్ మెటీరియల్‌తో 2,000nits వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తాయి. రెండు హ్యాండ్‌సెట్‌లు డెస్ట్, వాటర్ రెసిస్టెన్స్ IP68 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. ఆపిల్ కొత్త 3nm చిప్‌సెట్ A17 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తాయి. ఇతర పోటీదారులతో పోలిస్తే.. 3 రెట్లు ఎక్కువ సామర్థ్యాన్ని అందిస్తాయి.

iPhone 15 Pro, iPhone 15 Pro Max with 3nm A17 Pro Chip, Action Button Launched in India_ Price, Specifications

Apple iPhone 15 Pro Launch : iPhone 15 Pro, iPhone 15 Pro Max with 3nm A17 Pro Chip, Action Button Launched in India_ Price, Specifications

ఈ కొత్త ఐఫోన్ హ్యాండ్‌సెట్‌లు గ్రేడ్ 5 టైటానియం, అల్యూమినియంతో తయారయ్యాయి. మ్యూట్ స్విచ్‌ స్థానంలో కొత్త యాక్షన్ బటన్‌ను కూడా అందించింది. 48MP వైడ్ యాంగిల్ కెమెరాను f/1.78 ఎపర్చర్‌తో కలిగి ఉంటాయి. లెన్స్ గ్లేర్‌ను తగ్గించడానికి లేయర్ కలిగి ఉంటాయి. f/2.2 ఎపర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు, ఐఫోన్ 15 ప్రో 12MP 3x టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.

అయితే, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్ 12MP పెరిస్కోప్ కెమెరా సెటప్‌తో f/2.8 ఎపర్చర్‌తో 5x ఆప్టికల్ జూమ్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని పేర్కొంది. ఐఫోన్ 15 సిరీస్‌లోని ప్రో మోడల్‌లు 12MP ట్రూడెప్త్ కెమెరాతో f/1.9 ఎపర్చరుతో ఉంటాయి. ఈ కెమెరా ఫీచర్లతో సెల్ఫీలు, వీడియో కాల్‌లు చేసేందుకు ఉపయోగించవచ్చు.

సాధారణ మోడల్‌ల మాదిరిగానే, కొత్త ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, USB టైప్-C పోర్ట్‌, USB 3.0 స్పీడ్ కలిగి ఉంటాయి. ఆప్షనల్ కేబుల్‌తో గరిష్టంగా 10Gbps డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ అందిస్తుంది. ఆపిల్ ప్రకారం.. ఐఫోన్ 15 ప్రో ఛార్జింగ్ ఒక రోజుంతా (ఫుల్ డే) వస్తుంది. అయితే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుందని పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్‌లు Qi2 ప్రమాణానికి కూడా సపోర్టు ఇస్తాయి. కంపెనీ ప్రకారం.. వేగవంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్ స్పీడ్ సపోర్టు చేస్తాయి.

Read Also : iPhone 15 Price: అందుబాటులో ఐఫోన్ 15 ధరలు.. Pro Max తప్ప పెరగని ధరలు.. ఐఫోన్ లవర్స్ కు పండగే!