×
Ad

Apple iPhone 15 : ఆఫర్ అదిరింది గురూ.. ఆపిల్ ఐఫోన్ 15పై ఊహించని డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి!

Apple iPhone 15 : ఐఫోన్ 15 సరసమైన ధరకే కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే..

1/6
Apple iPhone 15 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఐఫోన్‌ 15 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 కొనుగోలుపై కిర్రాక్ డిస్కౌంట్ పొందవచ్చు. అన్ని డిస్కౌంట్లు, బోనస్‌లతో దాదాపు రూ.14,900 వరకు తగ్గింపు పొందవచ్చు.
2/6
ఐఫోన్ 15 మోడల్ డ్యూయల్ కెమెరా సెటప్, సూపర్ రెటినా ఓఎల్ఈడీ ప్యానెల్ భారీ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది. ఆపిల్ స్టోర్‌లో ఐఫోన్ 15 ధర రూ.59,900 ఉండగా ఇప్పుడు రూ.45వేల కన్నా తక్కువ ధరకే లభ్యమవుతోంది. ఆపిల్ ఐఫోన్ 15 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/6
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ధర తగ్గింపు : ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 15 రూ.7,901 తగ్గడంతో రూ.51,999కి లిస్ట్ అయింది. అదనంగా, కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. మీరు ట్రేడ్ చేసే ఫోన్ వాల్యూతో పాటు రూ.3 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా పొందవచ్చు.
4/6
మొత్తం ధర దాదాపు రూ.44,999కి తగ్గింది. నెలకు రూ.4,334 నుంచి ఈఎంఐతో మీరు ఈ ఐఫోన్ తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర హిడెన్ ఛార్జీలు ఉండొచ్చు. కొనుగోలుదారులు ఇంకా అదనంగా చెల్లిస్తే యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.
5/6
ఆపిల్ ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 6.1-అంగుళాల OLED ప్యానెల్‌, 60Hz రిఫ్రెష్ రేట్‌తో అందిస్తుంది. ఈ ఐఫోన్ 15 మోడల్ 4nm A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 6GB LPDDR5 ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది.
6/6
ఈ ఐఫోన్ 3,349mAh బ్యాటరీతో వస్తుంది. మంచి బ్యాకప్‌ను అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. 48MP OIS, 12MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఐఫోన్ 15 మోడల్ 12MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.