Apple iPhone 15 : ఐఫోన్ లవర్స్ ఎగిరిగంతేసే ఆఫర్.. ఇలా కొన్నారంటే.. రూ. 22వేలు తగ్గింపుతో ఐఫోన్ 15 మీ సొంతం..!
Apple iPhone 15 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్.. ఐఫోన్ 15 మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఇలా కొన్నారంటే ఏకంగా రూ. 22వేలు సేవ్ చేసుకోవచ్చు.. ఎలాగంటే?
- Sreehari A
- Published on- April 30, 2026 / 07:27 PM IST
Apple iPhone 15
- ఆపిల్ ఐఫోన్ 15 ధర భారీ తగ్గింపు.. విజయ్ సేల్స్‌లో రూ. 58వేల లోపే
- HDFC బ్యాంక్ ఆఫర్లతో అదనంగా రూ. 3,500 తగ్గింపు, ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా
- A16 చిప్, 48MP కెమెరా, రోజువారీ పర్ఫార్మెన్స్ కోసం బెస్ట ఐఫోన్ మోడల్
Apple iPhone 15 : ఐఫోన్ లవర్స్ మీకో గుడ్ న్యూస్.. తక్కువ ధరలో కొత్త ఐఫోన్ కావాలా? రూ. 79,999 ధరకు లాంచ్ అయిన ఐఫోన్ 15 ఇప్పుడు విజయ్ సేల్స్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ లేదా కార్డ్ ఆఫర్లతో భారీ తగ్గింపుతో ఇంటికి తెచ్చుకోవచ్చు.
2023లో లాంచ్ అయినా ఇప్పటికీ అద్భుతమైన ఐఫోన్ మోడల్. ఇప్పుడు (Apple iPhone 15) కేవలం రూ. 58వేల లోపు ధరకే లభిస్తోంది. ఈ ఐఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, A16 బయోనిక్ చిప్‌సెట్ ఉన్నాయి. ఇందులో 6.1-అంగుళాల OLED ప్యానెల్ కూడా ఉంది. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 ధర :
ఆపిల్ ఐఫోన్ 15 ఫస్ట్ రూ. 79,999 ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ. 57,900కే లభిస్తోంది. ఈ ఐఫోన్ రూ. 22,099 నేరుగా తగ్గింపు అందిస్తోంది. కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ధరను రూ. 3,500 వరకు తగ్గించుకోవచ్చు. తద్వారా అసలు ధర ఇంకా తగ్గించుకోవచ్చు.
Read Also : WhatsApp Backup : పండగ చేస్కోండి.. గూగుల్ డ్రైవ్‌కు గుడ్‌బై? ఇక వాట్సాప్‌లోనే ‘చాట్ బ్యాకప్’ కొత్త ఫీచర్..!
ఈఎంఐలో ఈ ఐఫోన్ కొంటే.. నెలకు రూ. 2,688 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. విజయ్ సేల్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కూడా అందిస్తోంది. ఇందులో పాత స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంకా తక్కువ ధరకే ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. కచ్చితమైన ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి.
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 15లో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. తద్వారా నేరుగా సూర్యరశ్మిలో కూడా ఈజీగా స్క్రీన్ చూడొచ్చు.
ఈ ఫోన్ A16 బయోనిక్ చిప్‌తో వస్తుంది. వీడియోలు చూసినా 26 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, అలాగే 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. అదనంగా, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది.
ఆపిల్ ఐఫోన్ 15 కొనాలా? వద్దా? :
మీరు 2026లో కొత్త ఐఫోన్ 15 కొనాలకుంటే.. మీది బెస్ట్ ఛాయిస్.. ఎందుకంటే.. ఇప్పటివరకూ కూడా ఆ ఐఫోన్ ధరకు తగ్గ ఫీచర్లను అందిస్తుంది. ఈ ఐఫోన్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. కెమెరాలు కూడా కిర్రాక్ ఉంటాయి. చాలా ఏళ్ల పాటు సాఫ్ట్ వేర్, సెక్యూరిటీ అప్‌డేట్‌లు వస్తాయి. అందుకే ఈ ఐఫోన్ కొనడం చాలా బెటర్.
