Apple iPhone 16 Price : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. ఈ ఐఫోన్ 16పై రూ.20వేలు తగ్గింపు.. ఇంత తక్కువకు మళ్లీ దొరకదు!
Apple iPhone 16 Price : ఆపిల్ ఐఫోన్ 16 ఇప్పుడు రూ. 20వేల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ బిగ్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Updated on- August 26, 2026 / 06:50 PM IST
Apple iPhone 16 Price
- ఐఫోన్ 16లో 48MP వైడ్-యాంగిల్ కెమెరా సెటప్
- 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR ఓఎల్ఈడీ డిస్ప్లే
- ఆక్టా-కోర్ ఆపిల్ A18 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది
Apple iPhone 16 Price : ఆపిల్ లవర్స్ డోంట్ మిస్.. ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే లభిస్తోంది. మీరు ఆపిల్ ఫ్లాగ్షిప్ ఐఫోన్‌ను డిస్కౌంట్ ధరలో కొనాలని చూస్తుంటే ఇంతకన్నా బెటర్ టైమ్ ఉండదు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 డిస్కౌంట్ ధరకే లిస్టు అయింది.
బ్యాంక్ ఆఫర్లతో రూ. 20వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే అదనంగా మరింత డబ్బులు ఆదా చేయొచ్చు. ఐఫోన్ 16 ఆఫర్లు, డిస్కౌంట్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఫోన్ 16 ధర ఆఫర్లు :
ఐఫోన్ 16 మోడల్ 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.64,900కు లిస్టు అయింది. బ్యాంక్ ఆఫర్ విషయానికొస్తే.. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై రూ.5,145 తగ్గింపు పొందవచ్చు. దాంతో తగ్గింపు ధర రూ.59,755 అవుతుంది.
అంతేకాదు.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే ధర రూ.51,600 వరకు తగ్గుతుంది. ఈ ఆఫర్ టాప్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఐఫోన్ సెప్టెంబర్ 2025లో ధరకు రూ.79,900 లాంచ్ కాగా, ఇప్పుడు రూ.20వేలు చౌకగా లభిస్తోంది.
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16లో 1179×2556 పిక్సెల్స్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ 2000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఐఫోన్ ఆక్టా-కోర్ ఆపిల్ A18 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. ఈ ఐఫోన్ iOS18పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
కెమెరా విషయానికి వస్తే.. ఈ ఐఫోన్లో బ్యాక్ సైడ్ ఎఫ్/1.6 అపర్చర్‌తో 48MP వైడ్-యాంగిల్ కెమెరా ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/1.9 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. కొలతల పరంగా చూస్తే.. ఈ ఐఫోన్ 147.6 మిమీ పొడవు, 71.6 మిమీ వెడల్పు, 7.8 మిమీ మందం, 170 గ్రాముల బరువు ఉంటుంది.
