Apple iPhone 17 : కొంటే ఐఫోన్ ఇప్పుడే కొనాలి.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ఇంతకన్నా తక్కువకు మళ్లీ దొరకదు..!

Apple iPhone 17 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ముందు ఐఫోన్ 17 డీల్స్‌కు సంబంధించిన టీజర్ రివీల్ అయింది. ఈ ఐఫోన్ ధర రూ. 80వేల లోపు ఉంటుందని అంచనా. పూర్తి ఆఫర్, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.

  • Published on- September 22, 2026 / 09:01 PM IST

Apple iPhone 17

  • ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 17 ధర రూ. 80 వేల కన్నా తక్కువే
  • ఐఫోన్ 17తో సహా ఎర్లీ బర్డ్ డీల్స్ సెప్టెంబర్ 24న ప్రారంభం
  • ఎంపిక చేసిన యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై 10శాతం తగ్గింపు

Apple iPhone 17 : మీరు కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్‌పై కన్నేసి ఉంచండి. ఈ ఏడాదిలో జరగబోయే ఈ భారీ సేల్‌కు ముందే ఆపిల్ ఐఫోన్ 17తో సహా ఎర్లీ బర్డ్ డీల్స్‌ను ప్రకటించింది. ముఖ్యంగా, ఈ ఎర్లీ బర్డ్ డీల్స్ సెప్టెంబర్ 24న ప్రారంభమవుతాయి.

మెయిన్ సేల్ ప్రారంభానికి ముందే ఆసక్తిగల కస్టమర్లు కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై మరిన్ని ఆఫర్లను పొందవచ్చు. అయితే, ఈ డీల్‌లో ఐఫోన్ 17 ఫైనల్ ధర ఇంకా రివీల్ చేయలేదు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

సెప్టెంబర్ 24 నుంచే ఎర్లీ బర్డ్ సేల్ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఎర్లీ బర్డ్ డీల్స్ సెప్టెంబర్ 24న ప్రారంభమవుతాయి. ఈ సమయంలో కస్టమర్లు వివిధ ప్రొడక్టులను ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. తమకు ఇష్టమైన వస్తువులను విష్‌లిస్ట్‌కు యాడ్ చేసుకోవచ్చు. ఎర్లీ బర్డ్ డీల్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్, ప్రొడక్టులు ఉంటాయి.

ఈ లిస్టులో ఐఫోన్ 17తో పాటు శాంసంగ్ గెలాక్సీ S17, వివో T5x 5జీ, రియల్‌మి P4 5జీ, రియల్‌మి P4 లైట్ 5జీ, మోటోరోలా సిగ్నేచర్, మోటో G06 పవర్, లావా విరాట్ V1 5జీ వంటి ఫోన్‌లు కూడా ఉన్నాయి. శాంసంగ్ బుక్4 i5 ల్యాప్‌టాప్, 65-అంగుళాల 4K టీవీపై కూడా డీల్స్ ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ సూచించింది.

Read Also : Weather Alert Apps : ఏపీకి ‘అర్నాబ్’ తుఫాన్ టెన్షన్.. క్షణక్షణం వెదర్ అప్‌డేట్ కావాలా? ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉండాల్సిందే!

ఐఫోన్ 17పై తగ్గింపు ఎంతంటే? :
ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 17 ఎర్లీ బర్డ్ డీల్ ఫైనల్ డేట్ వెల్లడించలేదు. అయితే, ఈ సేల్‌లో మెయిన్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లలో ఈ ఐఫోన్ కూడా ఉంది. ధర, అదనపు ఆఫర్లకు సంబంధించి సేల్ వివరాలు సెప్టెంబర్ 24న వెల్లడి కానుంది. భారత మార్కెట్లో ఐఫోన్ 17 మోడల్ 256GB మోడల్ ధర రూ. 82,900 నుంచి ప్రారంభమవుతుంది. వివిధ ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఈ ఫోన్‌పై ధర తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ పొందవచ్చు.

బ్యాంక్ కార్డుల బెనిఫిట్స్ ఏంటి? :

బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఎంపిక చేసిన యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లతో చేసే పేమెంట్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు కూడా అర్హత గల కొనుగోళ్లపై 10 శాతం ఆదా పొందవచ్చు.

అదనంగా, మీ ఫస్ట్ సూపర్ మనీ లావాదేవీపై 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆప్షన్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా కస్టమర్లు రూ. లక్ష వరకు క్రెడిట్ పొందవచ్చు. అదనంగా, నో-కాస్ట్ ఈఎంఐ, ఎంపిక చేసిన కొనుగోళ్లపై అదనంగా రూ. 500 తగ్గింపు వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎప్పుడంటే? :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ అక్టోబర్ 9న ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులు, అలాగే అర్హత ఉన్న ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు అక్టోబర్ 8 నుంచే అడ్వాన్స్ యాక్సెస్‌ను పొందవచ్చు. అయితే, ఐఫోన్ 17తో సహా కొన్ని ప్రొడక్టులపై ఎర్లీ బర్డ్ డీల్స్ సెప్టెంబర్ 24 నుంచే ప్రారంభమవుతాయి.