Apple iPhone 17 : ఇది కదా డిస్కౌంట్.. ఐఫోన్ 17పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!

Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 అతి చౌకైన ధరకే లభిస్తోంది.. సాధారణ ధర రూ.1,24,900 కాగా, ఇప్పుడు ఐఫోన్ ధర రూ.1,16,190కి తగ్గింది.. విజయ్ సేల్స్ ద్వారా ఈ ఐఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలంటే?

Apple iPhone 17

  • ఈ ఐఫోన్‌లో ఆపిల్ A19 చిప్‌సెట్‌ ఉంది
  • డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌
  • సేఫ్టీ కోసం ఎమర్జెన్సీ SOS ఫీచర్లు

Apple iPhone 17 : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ పండుగ సీజన్‌లో అనేక స్మార్ట్ ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు తక్కువ ధరకే ఐఫోన్ 17 కొనాలని చూస్తుంటే ఇంతకన్నా బెస్ట్ టైమ్ ఉండదు..

విజయ్ సేల్స్‌ ద్వారా మీరు ఐఫోన్ 17 డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు.. ఈ ఐఫోన్‌ను సుమారు రూ.19వేలు తక్కువకే పొందవచ్చు. ఐఫోన్ 17 బెస్ట్ డీల్, ధర ఆఫర్లకు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్ 17 తగ్గింపు ధర ఆఫర్ :
ఐఫోన్ 17 అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. విజయ్ సేల్స్‌లో ఈ ఐఫోన్‌ను భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. కానీ, ఈ ఆఫర్‌ను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.. విజయ్ సేల్స్ ద్వారా ఐఫోన్ 17 అసలు ధరపై 7శాతం తగ్గింపు పొందవచ్చు.. సాధారణ ధర రూ.1,24,900 కాగా, ఇప్పుడు ఐఫోన్ ధర రూ.1,16,190కి తగ్గింది. అంటే రూ.8,710 నేరుగా తగ్గింపు పొందవచ్చు.

Read Also : Samsung Galaxy Z Fold 7 : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ధర జస్ట్ ఎంతంటే?

ఐఫోన్ 17 చౌకైన ధరకే :
ఐఫోన్ 17ను మరింత చౌకైన ధరకే కొనేసుకోవచ్చు. హెచ్‌ఎస్‌బీసీ తాజ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా ఈఎంఐలో ఫోన్‌ కొంటే మీకు రూ.10వేలు తగ్గింపు లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లతో రూ.6వేలు తగ్గింపు, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లు రూ.4వేలు తగ్గింపు అందిస్తుంది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ ఐఫోన్‌ను రూ.19వేల వరకు తక్కువకే కొనేసుకోవచ్చు..

ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17 బ్యాక్ సైడ్ ఎఫ్/1.78 అపర్చర్‌తో 48MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/1.9 అపర్చర్‌తో 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఆపిల్ A19 చిప్‌సెట్‌తో పాటు iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

ఈ ఐఫోన్‌లో 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 17 డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ అందిస్తుంది.

సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ ఐఫోన్‌లో ఎమర్జెన్సీ SOS క్రాష్ డిటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఐఫోన్ పొడవు 149.6 మిమీ ఉండగా వెడల్పు 71.5 మిమీ, మందం 7.95 మిమీ, బరువు 177 గ్రాములు ఉంటుంది.