iPhone 17 Offers : కొత్త ఐఫోన్ 17 కొంటున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కడ చీప్‌గా దొరుకుతుందో తెలుసా?
iPhone 17 on Flipkart vs Amazon : ఆపిల్ ఐఫోన్ 17 కొనాలనుకుంటున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ధరలు, బ్యాంక్ ఆఫర్లు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లలో ఎక్కడ ఎక్కువ ఆదా అవుతుందో తెలుసుకోండి.
- Sreehari A
- Published on- November 16, 2026 / 12:10 PM IST
iPhone 17 on Flipkart vs Amazon
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 బెస్ట్ డీల్ ఎక్కడంటే?
- ఐఫోన్ 17పై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఇలా కొన్నారంటే?
- బ్యాంక్ కార్డుతో కొంటే ఎక్కడ ఎక్కువ లాభమో తెలుసా?
iPhone 17 Price : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? సాధారణంగా ఎవరికైనా ఐఫోన్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది.. ముఖ్యంగా కొత్త ఐఫోన్ 17 సిరీస్ కోసం చాలామంది చూస్తుంటారు.. అయితే ఆపిల్ అసలు ధరకు కాకుండా కాస్త తక్కువకే ఐఫోన్ వస్తుంటే ఎవరూ వద్దంటారు..
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17పై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏయే ప్లాట్ ఫారం ఎంత తక్కువకు ఆఫర్లను అందిస్తున్నాయో ఓసారి కంపేర్ చేయాలి.. ఎందుకంటే రెండు ప్లాట్‌ఫామ్స్‌లోనూ ధరలు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు వేర్వేరుగా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
ధరలో అమెజాన్ ఆఫర్ అదుర్స్ :
ఐఫోన్ 17 (256GB) ధర అమెజాన్‌లో సుమారు రూ.92,900గా ఉండగా, ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు రూ.94,999గా ఉంది. ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ లేకుండా కొనేవారికి అమెజాన్ కాస్త చవకగా లభిస్తోంది. అయితే, ఈ ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.
బ్యాంక్ ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ హవా :
బ్యాంక్ కార్డులతో కొనేవారికి ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్లు కనిపిస్తున్నాయి. ICICI, HDFC కార్డులతో సుమారు రూ.7,016 వరకు, SBI, Flipkart Axis కార్డులతో దాదాపు రూ.7వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అమెజాన్‌లో (Amazon Pay ICICI) కార్డుపై సుమారు రూ.3,299 డిస్కౌంట్ ఉంది. అర్హత ఉన్న కార్డు ఉంటే ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే లాభామా? :
పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.62,750 నుంచి రూ.64,500 వరకు తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్‌లోనూ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. అయితే, మీ పాత ఫోన్ మోడల్, కండిషన్, పిన్‌కోడ్ ఆధారంగా అసలు వాల్యూ మారుతుంది.
మరి ఏది బెస్ట్? :
కార్డు లేకుండా కొనేవారికి, అమెజాన్, బ్యాంక్ ఆఫర్లు వాడేవారికి ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ఆప్షన్. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసేవారు మాత్రం రెండు సైట్లలోనూ ఫైనల్ ధరను కంపేర్ చేసి చూడండి.. ఆర్డర్ చేసే ముందు చెక్‌అవుట్ పేజీలో కనిపించే ఫైనల్ అమౌంట్ చూశాకే కొనడం బెటర్..
