Apple iPhone 17 : ఏంది భయ్యా ఆఫర్.. ఇంత తక్కువకే ఐఫోన్ వస్తే ఎలా వదిలేస్తారు బ్రో.. కొత్త ధర ఎంతంటే?
Apple iPhone 17 : 2025లో లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 17 అద్భుతమైన స్పెసిఫికేషన్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో భారీ తగ్గింపు ధరకు లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- April 25, 2026 / 11:43 AM IST
Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 17 భారీ తగ్గింపుతో లభిస్తోంది. కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. 2025లో లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్లలో ఐఫోన్ 17 మోడల్ ఒకటి.
ఈ కొత్త ఐఫోన్‌లో అనేక కొత్త ఫీచర్లను అందించింది. మీరు కూడా ఈ ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం, విజయ్ సేల్స్ ఈ ఐఫోన్ కొనుగోలుపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లకు సంబంధించి ఓసారి చూద్దాం..
విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 17 ధర తగ్గింపు : ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 82,900 నుంచి విజయ్ సేల్స్ ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 80,390 ధరకే అందుబాటులో ఉంది.
అంతేకాదు, HSBC క్రెడిట్ కార్డ్ యూజర్లంతా అదనంగా రూ. 4500 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఐఫోన్ ధర మరింత తగ్గి రూ. 75,890 అవుతుంది. సేజ్, లావెండర్, మిస్ట్ బ్లూ, వైట్ బ్లాక్ అనే 5 విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఆపిల్ ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఐఫోన్ 17లో 6.3-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 3000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. iOS26 ఆధారంగా రన్ అవుతుంది.
ఆపిల్ A19 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇందులో 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU) కూడా ఉంది.
ఆపిల్ ఐఫోన్ 17లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP ప్రైమరీ షూటర్ 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి.
ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP ఫ్రంట్ సెన్సార్ ఉంది. ఈ ఐఫోన్ 3692mAh బ్యాటరీతో పాటు 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
