Apple iPhone 17 Pro Max : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే?

Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గిందోచ్.. లేటెస్ట్ ఐఫోన్ మోడల్ రూ. 15వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 17 Pro Max

  • అమెజాన్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,41,900కు తగ్గింది
  • అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ఆఫర్లతో రూ. 15వేలకుపైగా ఆదా
  • 6.9-అంగుళాల 120Hz ఓఎల్ఈడీ డిస్‌ప్లే, A19 ప్రో చిప్ ట్రిపుల్ 48MP కెమెరా

Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. కొత్త ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కోసం చూస్తున్నారా? అయితే ఇదే బెస్ట్ టైమ్.. ప్రస్తుతం అమెజాన్ ఈ ఐఫోన్ మోడల్ కొనుగోలుపై రూ. 15వేలకుపైగా తగ్గింపు అందిస్తోంది. ట్రిపుల్ కెమెరా, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, ప్రీమియం డిజైన్, యూజర్ ఇంటర్‌ఫేస్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర డిస్కౌంట్ డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర :
అమెజాన్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ రూ. 8వేలు భారీగా తగ్గింది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రస్తుతం రూ. 1,41,900కే లభిస్తోంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో అదనంగా రూ. 7,167 ఆదా చేసుకోవచ్చు. తద్వారా ధర సుమారు రూ. 1,35,000కు తగ్గుతుంది.

Read Also : New IRCTC Beta Website : ఇక టికెట్ బుకింగ్‌లో టెన్షన్ లేదు.. IRCTC కొత్త వెబ్‌సైట్‌లో ఈ 5 సూపర్ ఫీచర్లు మిస్ అవ్వకండి!

మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా రూ. 36,500 వరకు తగ్గింపు పొందవచ్చు. నెలకు రూ. 23,650 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను ఎంచుకోచవ్చు. అమెజాన్ ఆపిల్ ప్రొటెక్ట్ ప్లస్ కూడా రూ. 16,999కే అందిస్తోంది. ఈ ఆఫర్ డీప్ బ్లూ, కాస్మిక్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు :
ఆపిల్ 120Hz ప్రోమోషన్ టెక్నాలజీ, 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 6.9-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందిస్తుంది. సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్‌తో అల్యూమినియం యూనిబాడీతో వస్తుంది. ఈ ఐఫోన్ 6-కోర్ సీపీయూ, వేపర్ ఛాంబర్ కూలింగ్, 12GB ర్యామ్, ఆపిల్ కొత్త A19 ప్రో చిప్‌తో రన్ అవుతుంది. 2TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

కెమెరా పరంగా చూస్తే మెయిన్, అల్ట్రా వైడ్, 4x ఆప్టికల్, 40x వరకు డిజిటల్ జూమ్‌, టెట్రాప్రిజం టెలిఫోటో లెన్స్‌తో మూడు 48MP సెన్సార్లు ఉన్నాయి. 4K డాల్బీ విజన్, ప్రోరెస్ వీడియో సపోర్ట్‌తో 18MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది.