Apple iPhone 17 Pro Max : వావ్.. అత్యంత చౌకైన ధరకే ఐఫోన్ 17 ప్రో మాక్స్.. ఇలా కొంటే రూ. 16 వేలకు పైగా ఆదా..!

Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గిందోచ్.. క్రోమాలో ఇలా కొన్నారంటే రూ. 16వేలకు పైగా డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 4వేలు బ్యాంకు క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా పొందొచ్చు.

Apple iPhone 17 Pro Max

  • ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో 48MP మెయిన్ కెమెరా సెటప్
  • 18MP ఫ్రంట్ కెమెరా, ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్‌
  • సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 18MP ఫ్రంట్ కెమెరా

Apple iPhone 17 Pro Max : అసలే పండుగ సీజన్‌.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భారీ సేల్స్ మొదలయ్యాయి. మీరు ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ తక్కువ ధరకే కొనాలని చూస్తుంటే మీకోసం క్రోమా అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది.

ఈ సమయంలో ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. క్రోమాలో ధర తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లతో పాటు పెద్ద మొత్తంలో డబ్బులు (Apple iPhone 17 Pro Max) ఆదా చేసుకోవచ్చు. ఈ ఆపిల్ ఐఫోన్‌లో 48MP ప్రైమరీ రియర్ కెమెరా, 18MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలివే..

ఆఫర్లు, డిస్కౌంట్లు :
ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256GB స్టోరేజ్ వేరియంట్ క్రోమాలో రూ. 1,39,990కి లిస్టు అయింది. ఈ ఐఫోన్ సెప్టెంబర్ 2025లో రూ. 1,49,900కి లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 5 శాతం తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర రూ. 1,32,991కి తగ్గింది. ఈ ఐఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ. 16,909 తక్కువకు అందుబాటులో ఉంది.

Read Also : Google Pixel 11 : ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లుచెదిరే డీల్స్.. రూ.90,000 పిక్సెల్ ఫోన్ ఇప్పుడు రూ.21,000 పైగా తక్కువకే..!

ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో ఎఫ్/1.78 అపర్చర్‌తో 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/2.8 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

ఈ ఐఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో 2868×1320 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.9-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంది.

ఈ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా iOS 26పై రన్ అవుతుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఐఫోన్‌లో 5జీ, USB 3.0 టైప్-సి పోర్ట్, Wi-Fi 7, eSIM సపోర్ట్, బ్లూటూత్ 6 ఉన్నాయి. ఈ ఐఫోన్ మోడల్ పొడవు 163.4 మి.మీ, వెడల్పు 78.0 మి.మీ., మందం 8.75 మి.మీ. ఉంటుంది. బరువు 231 గ్రాములు ఉంటుంది.