Apple iPhone 17 Pro Max : కొంటే ఐఫోన్ కొనాలి.. ఈ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై ఊహించని డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఐఫోన్ లవర్స్ రూ. 17వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Updated on- August 25, 2026 / 04:38 PM IST
Apple iPhone 17 Pro Max
- ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే
- 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్
- 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే సెటప్
Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ లవర్స్ మీకోసమే.. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే..
బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, 18MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై డిస్కౌంట్లు ఆఫర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర, ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 1,41,900కే లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 9వేలు తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత ఫైనల్ ధర రూ. 1,32,900 అవుతుంది. అంతేకాదు.. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా ధరను రూ. 57,250 వరకు తగ్గించుకోవచ్చు.
Read Also : Jio vs Airtel : జియో రూ.495 vs ఎయిర్‌టెల్ రూ.489.. ఏ ప్లాన్ బెటర్? బెనిఫిట్స్ ఎందులో ఎక్కువ? ఫుల్ డిటెయిల్స్
అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది టాప్ బెనిఫిట్, ప్రస్తుత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఐఫోన్ గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 1,49,900 ధరకు లాంచ్ అయింది. అంటే సుమారుగా రూ. 17వేలు చౌకగా లభిస్తుంది.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో 2868×1320 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్, 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఈ ఐఫోన్ iOS 26పై రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, USB 3.0 టైప్-C పోర్ట్, Wi-Fi 7, eSIM సపోర్ట్, బ్లూటూత్ 6 ఉన్నాయి.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో ఎఫ్/1.78 అపర్చర్‌తో 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/2.8 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. కొలతల పరంగా పరిశీలిస్తే.. ఈ ఐఫోన్ 163.4 మిమీ పొడవు, 78.0 మిమీ వెడల్పు, 8.75 మిమీ మందం, 231 గ్రాముల బరువు ఉంటుంది.
