Apple iPhone 17e
Apple iPhone 17e : ఆపిల్ లవర్స్ కోసం కొత్త ఐఫోన్ 17e వచ్చేసింది. టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త సరసమైన ఐఫోన్ 17e మోడల్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఐఫోన్ 17 సిరీస్‌లో చౌకైన మోడల్ ఇదే. ఈసారి, కంపెనీ కొత్త A19 చిప్, మాగ్‌సేఫ్ సపోర్ట్, సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్‌తో సహా మెయిన్ అప్‌గ్రేడ్‌లతో వచ్చింది.
అయితే, ఈ ఐఫోన్‌లో ఇప్పటికీ 60Hz OLED డిస్‌ప్లే, సింగిల్ బ్యాక్ కెమెరా ఉన్నాయి. బేస్ వేరియంట్ ఇప్పుడు 256GB స్టోరేజీతో వస్తుంది. కొత్త ఐఫోన్ 17e ధర, ఇతర స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం..
భారత్‌లో ఐఫోన్ 17e ధర, సేల్ తేదీ :
భారత మార్కెట్లో ఐఫోన్ 17e ధర 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 64,900 నుంచి ప్రారంభమవుతుంది. 512GB మోడల్ ధర రూ. 84,900కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, సాఫ్ట్ పింక్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఐఫోన్ 17e అడ్వాన్స్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. మార్చి 11న ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, అధీకృత రిటైల్ స్టోర్‌లలో ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది.
ఆపిల్ ఐఫోన్ 17e మోడల్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ ట్రూ టోన్, 800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. ఆపిల్ సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. గత ఐఫోన్ మోడల్ కన్నా 3 రెట్లు స్క్రాచ్ రెసిస్టెన్స్ అందిస్తుంది. ఈ కొత్త ఐఫోన్ 17e నాచ్ డిజైన్ కూడా అందిస్తుంది.
ఆపిల్ లేటెస్ట్ A19 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. ఇందులో 6-కోర్ సీపీయూ, 4-కోర్ జీపీయూ, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. ఈ ఫోన్ 8GB ర్యామ్ అందిస్తుంది. ఈజీ మల్టీ టాస్కింగ్, ఏఐ ఫీచర్లతో వస్తుంది. iOS26లో రన్ అవుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. IP68 రేటింగ్ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.
కెమెరా, ఛార్జింగ్ :
ఆపిల్ ఐఫోన్ 17e మోడల్ ఫొటోల కోసం సింగిల్ 48MP రియర్ కెమెరా ఉంది. OIS సపోర్టుతో వస్తుంది. ఈ ఫోన్ 2x ఆప్టికల్ జూమ్ కూడా అందిస్తుంది. అయితే, ఫ్రంట్ సైడ్ 12MP ట్రూడెప్త్ కెమెరా అందుబాటులో ఉంది.
అయితే, యాక్షన్ మోడ్, సినిమాటిక్ వీడియో వంటి ప్రీమియం ఫీచర్లు లేవు. ఈసారి మ్యాగ్‌సేఫ్ సపోర్టు అందిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఈ ఫోన్ 20W వైర్డు, 7.5W మ్యాగ్ సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.