Apple iPhone 18 : ఐఫోన్ 18లో అదిరిపోయే అప్‌గ్రేడ్‌లు! 48MP కెమెరా, 120Hz డిస్‌ప్లే.. రిలీజ్ డేట్ ఇదే!
Apple iPhone 18 Price : ఆపిల్ ఐఫోన్ 18పై ఆసక్తికరమైన లీకులు వెలుగులోకి వచ్చాయి. 48MP డ్యూయల్ కెమెరా, 120Hz ఓఎల్ఈడీ డిస్‌ప్లే, A20 చిప్, 12GB ర్యామ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని సమాచారం..
- Sreehari A
- Published on- October 2, 2026 / 07:56 PM IST
Apple iPhone 18
- ఆపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్18 ధర, రిలీజ్ డేట్ వివరాలివే
- 48MP కెమెరా, 120Hz స్క్రీన్, ధర, కెమెరా, డిస్‌ప్లే వివరాలు లీక్
- 6.3-అంగుళాల OLED డిస్‌ప్లే కూడా ఉండవచ్చు
Apple iPhone 18 Price : ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ 18 రాబోతుంది. ఐఫోన్ మోడల్ రాకపై టెక్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆపిల్ ఐఫోన్ లాంచ్ సైకిల్‌లో అనేక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ అంచనాల నేపథ్యంలో బేస్ మోడల్ ఐఫోన్ 18 వచ్చే ఏడాది ప్రత్యేకంగా మార్కెట్లోకి రావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మొత్తం లీకులు, అంచనాల ఆధారంగా ఓసారి పరిశీలిద్దాం..
లీకుల ప్రకారం.. ఐఫోన్ 18లో 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండొచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కొత్త A20 చిప్, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ఉండొచ్చు.
48MP డ్యూయల్ కెమెరా.. భారీ బ్యాటరీ? :
కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 18కు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ఇందులో OISతో 48MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP ఫ్రంట్ కెమెరా రావచ్చని సమాచారం.
ఇక బ్యాటరీ సామర్థ్యం ఐఫోన్ 17తో పోలిస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది. 25W మ్యాగ్ సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉండొచ్చు. డిజైన్‌లో భారీ మార్పులు లేకుండా, కొత్త కలర్ ఆప్షన్లతో ఐఫోన్ ఉండొచ్చనని అంచనాలు నెలకొన్నాయి.
భారత్ ధర, లాంచ్ తేదీ వివరాలివే :
12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,999గా ఉండొచ్చని సమాచారం. లాంచ్ విషయానికొస్తే 2027 మార్చి 13 నుంచి మార్చి 19 మధ్య ఐఫోన్ 18 మార్కెట్లోకి రావచ్చని కొన్ని లీకులు తెలిపాయి. అయితే, ఐఫోన్ ధర, స్పెసిఫికేషన్లు, లాంచ్ తేదీపై ఆపిల్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
