×
Ad

Apple iPhone 18 Pro : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోందోచ్.. ఐఫోన్ 17 ప్రో కన్నా డిజైన్ అదుర్స్.. ఆ రెండు ఫీచర్లు మాత్రం హైలెట్..!

Apple iPhone 18 Pro : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోందోచ్.. ఐఫోన్ 17 ప్రో కన్నా అత్యాధునిక ఫీచర్లతో రానుంది. ఐఫోన్ 18 ప్రో డిజైన్, ఇతర ఫీచర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Apple iPhone 18 Pro

Apple iPhone 18 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీకోసం అతి త్వరలో ఐఫోన్ 18 ప్రో రాబోతుంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 18 ప్రోపై పనిచేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. రాబోయే ఐఫోన్ 18 ప్రో సిరీస్ భారీ డిజైన్ మార్పులతో రానుందని పుకార్లు వస్తున్నాయి. మొత్తం రెండు ప్రధాన మార్పులతో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఐఫోన్ 17 ప్రో మోడళ్లలో కనిపించే డ్యూయల్-టోన్ రియర్ ఫినిష్ స్థానంలో సరికొత్త డిజైన్ అందించే అవకాశం ఉందని లీక్‌లు సూచించాయి.

టిప్‌స్టర్ ప్రకారం.. నెక్స్ట్-జెన్ ఐఫోన్ మరింత (Apple iPhone 18 Pro) సింగిల్ బ్యాక్‌ను కలిగి ఉండవచ్చు. ఇదివరకే, ఐఫోన్ 17 ప్రోలో ఆపిల్ మాగ్‌సేఫ్ ఛార్జింగ్ కోసం గ్లాస్ కటౌట్‌తో బ్యాక్ డిజైన్‌ ప్రవేశపెట్టింది. అల్యూమినియం యూనిబాడీ సిరామిక్ షీల్డ్ 2 కటౌట్ మధ్య కలర్ వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది.

ఐఫోన్ 17 ప్రో సిరీస్‌ను గత వెర్షన్లకు వేరుగా ఉంటుంది. ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్ కోసం ఆపిల్ గ్లాస్ అల్యూమినియం ఫ్రేమ్ మధ్య కలర్ వ్యత్యాసాన్ని తగ్గించే బ్యాక్ గ్లాస్ రీప్లేస్‌మెంట్ ప్రాసెస్ అప్‌డేట్ చేయాలని యోచిస్తోంది. రాబోయే మోడళ్లకు మరింత ఇంటిగ్రేటెడ్ డిజైన్‌ అందిస్తుంది.

Read Also : Motorola Razr 60 Ultra : ఇది కదా డిస్కౌంట్.. మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!

ఈ ఏడాది ప్రారంభంలో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ కొంచెం ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ సూచించింది. ఇప్పుడు ఈ పుకారు ఐఫోన్ 18 ప్రో కొత్త డిజైన్‌ను సూచిస్తుంది. ఉదాహరణకు.. మొమెంటరీ డిజిటల్ గతంలో లీక్‌లో ఐఫోన్ 14 ఎల్లో ఎండ్, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 టైటానియం మిలనీస్ లూప్‌ను కలిగి ఉంటుందని నివేదించింది. కానీ, అందులో నిజం లేదు. సిరామిక్ షీల్డ్ బ్యాక్‌ప్లేట్ కాకుండా ఐఫోన్ 18 ప్రో మోడల్స్ భారీ కెమెరా సెటప్‌తో 17 ప్రోతో సమానంగా ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి.

డిజైన్ మార్పులతో పాటు, ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్ ఆపిల్ A20 ప్రో చిప్‌లతో లాంచ్ కావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. టీఎస్ఎంసీ అడ్వాన్స్ 2nm ప్రాసెస్‌పై రన్ అవుతాయి. ఆపిల్ సొంత C2 మోడెమ్‌ను కలిగి ఉంటాయి. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ కంపెనీ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్‌తో పాటు సెప్టెంబర్ 2026లో లాంచ్ అవుతాయి. కంపెనీ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ ఎయిర్‌ను కూడా లాంచ్ చేస్తారని భావించారు. కానీ తక్కువ అమ్మకాలతో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 2ను నిలిపివేసింది.