Motorola Razr 60 Ultra : ఇది కదా డిస్కౌంట్.. మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!
Motorola Razr 60 Ultra : కొత్త మోటోరోలా రెజర్ 60 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 19,100 ధర తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే..
Motorola Razr 60 Ultra
Motorola Razr 60 Ultra : మోటోరోలా ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్. మోటోరోలా మడతబెట్టే ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గింది. మొదట రూ.1,09,000 ధరకు లభించిన ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఇప్పుడు రూ.90వేల లోపు ధరకు అందుబాటులో ఉంది.
ప్రీమియం ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌లో 8 లక్షల కన్నా (Motorola Razr 60 Ultra) ఎక్కువ ఫోల్డ్స్ కోసం టైటానియం-రీన్ఫోర్స్డ్ హింజ్, మోటో ఏఐ అప్‌గ్రేడ్స్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ అనేక ఇతర హై-ఎండ్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. మీరు ఫ్లిప్ ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇదే అద్భుతమైన అవకాశం. మోటోరోలా రేజర్ 60 అల్ట్రా 5Gలో ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా రేజర్ 60 అల్ట్రా డీల్ :
ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఫోన్ రూ.89,900కి లిస్ట్ అయింది. కొనుగోలుదారులు అసలు ధర కన్నా నేరుగా రూ.19,100 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు తమ ఎస్బీఐ క్రెడిట్ కార్డులు లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ.4వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ డీల్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ప్రీమియం స్టైల్ అందిస్తుంది. మెయిన్ 6.96-అంగుళాల ఎల్టీపీఓ pOLED డిస్‌ప్లే సూపర్-స్మూత్ 165Hz వద్ద రన్ అవుతుంది. HDR10+, డాల్బీ విజన్ 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ సిరామిక్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. బయటి వైపున 4-అంగుళాల అమోల్డ్ కవర్ స్క్రీన్ కలిగి ఉంది. 165Hz వద్ద కూడా రిఫ్రెష్ అవుతుంది. 3,000 నిట్స్ చేరుకుంటుంది.
మోటోరోలా ఫోన్ లోపల స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ ద్వారా రన్ అవుతుంది. 16GB వరకు ర్యామ్ 512GB స్టోరేజీతో వస్తుంది. 4,700mAh బ్యాటరీ 68W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 పైన మోటోరోలా హలో యూఐతో రన్ అవుతుంది. 3 ఏళ్ల మెయిన్ అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. మోటోరోలా రెజర్ 60 అల్ట్రా బ్యాక్ సైడ్ డ్యూయల్ 50MP కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో మెయిన్ వైడ్ సెన్సార్ 2x ఆప్టికల్ జూమ్‌తో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. రెండూ OISతో అమర్చి ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోన్ 30x ఏఐ జూమ్ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మోటోరోలా ఏఐ అప్‌గ్రేడ్స్ ఫ్లాగ్‌షిప్-లెవల్ కెమెరా ఎక్స్‌పీరియన్స్, కలర్ కచ్చితత్వం, లో-లైటింగ్ షాట్‌లతో అద్భుతంగా ఉంటుంది.
