OnePlus 15 Review : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి భయ్యా.. 7300mAh బ్యాటరీతో వన్‌ప్లస్ 15 వచ్చేసింది.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

OnePlus 15 Review : భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ 15 లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ కలిగి ఉంది. 7000mAh బ్యాటరీతో ఫస్ట్ గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇదే..

OnePlus 15 Review : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి భయ్యా.. 7300mAh బ్యాటరీతో వన్‌ప్లస్ 15 వచ్చేసింది.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

OnePlus 15 Review

Updated On : November 14, 2025 / 5:43 PM IST

OnePlus 15 Review : వన్‌ప్లస్ అభిమానులకు పండగే.. సరికొత్త వన్‌ప్లస్ 15 ఫోన్ వచ్చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అనేక పవర్‌ఫుల్ ఫీచర్లతో వస్తుంది. చైనాలో లాంచ్ తర్వాత భారత్ సహా ఇతర మార్కెట్లలో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కంపెనీ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో ‘S’ మోడల్‌ను ప్రవేశపెట్టలేదు.

ఈ ఫోన్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ (OnePlus 15 Review) ద్వారా పవర్ పొందుతుంది. 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు ఇతర పవర్‌ఫుల్ ఫీచర్లు కూడా కలిగి ఉంది. అలాగే, ఈ వన్‌ప్లస్ ఫోన్ వివిధ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ధర, పూర్తి స్పెసిఫికేషన్లపై ఓసారి లుక్కేయండి..

ఈ వన్‌ప్లస్ 15 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ ఎల్టీపీఓ డిస్‌ప్లే కలిగి ఉంది. 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పవర్ అందిస్తుంది. 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో అడ్రినో 840 జీపీయూ కూడా ఉంది. మల్టీ టాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Read Also : Top Mini Family SUVs : ఫ్యామిలీతో బయటకు వెళ్లాలంటే ఇవే బెస్ట్.. మార్కెట్‌ని షేక్ చేస్తున్న మినీ SUV కార్లు ఇవే.. ఏది కొంటారో మీఇష్టం!

భారీ బ్యాటరీతో ఫస్ట్ గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ :

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో కూడిన 50MP సోనీ IMX906 మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. వన్‌ప్లస్ 15 భారీ 7,300mAh బ్యాటరీని కలిగి ఉంది. భారీ బ్యాటరీతో వచ్చిన ఫస్ట్ గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ కూడా ఇదే. 120W వైర్డు సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ వన్‌ప్లస్ ఫోన్ కేవలం 8.1mm మందం, 211 గ్రాముల బరువు ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఆక్సిజన్ OS16పై రన్ అవుతుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP66, IP68, IP69, IP69 రేటింగ్‌ కలిగి ఉంది. ఆక్సిజన్OS16పై రన్ అయ్యే కంపెనీ ఫస్ట్ ఫోన్. కొత్త యానిమేషన్లు, లాక్-స్క్రీన్ కస్టమైజడ్ ఆప్షన్, ఈ అప్‌డేట్ ప్లస్ మైండ్‌తో గూగుల్ జెమిని కనెక్టివిటీతో వస్తుంది. ఇతర ఫోన్ల మాదిరిగా అలర్ట్ స్లయిడ్ బటన్ లేదు.

ధర ఎంతంటే? :
వన్‌ప్లస్ ఫోన్ ప్రారంభ ధర రూ. 72,999 నుంచి లభ్యమవుతుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ (16GB ర్యామ్ + 512GB) టాప్ వేరియంట్ ధర రూ.79,999కు పొందవచ్చు. అయితే, ఆఫర్లతో వన్‌ప్లస్ ఫోన్‌ రూ.68,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ద్వారా పొందవచ్చు. లిమిటెడ్ టైమ్ ఆఫర్‌గా ఓపెన్ సేల్ సమయంలో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ఫ్రీగా లభిస్తుంది. ఈ ఓపెన్ సేల్ నవంబర్ 13, 2025న రాత్రి 8 గంటల నుంచి అందుబాటులో ఉంది.