Top Mini Family SUVs : ఫ్యామిలీతో బయటకు వెళ్లాలంటే ఇవే బెస్ట్.. మార్కెట్‌ని షేక్ చేస్తున్న మినీ SUV కార్లు ఇవే.. ఏది కొంటారో మీఇష్టం!

Top Mini Family SUVs : ఫ్యామిలీతో బయటకు వెళ్లాలంటే ఇవే బెస్ట్.. మార్కెట్‌ని షేక్ చేస్తున్న మినీ SUV కార్లు ఇవే.. ఏది కొంటారో మీఇష్టం!

Top Mini Family SUVs

Updated On : November 14, 2025 / 5:05 PM IST

Top Mini Family SUVs : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా ఫ్యామిలీ కస్టమర్ల కోసం మార్కెట్లో అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త కార్లు లభ్యమవుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో అనేక చిన్న ఫ్యామిలీలు సైతం కారు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఫ్యామిలీ కోసం ఫస్ట్ కారు కొనాలని భావిస్తుంటారు.

మీరు కూడా ఏదైనా కొత్త కారు కొనాలని (Top Mini Family SUVs) చూస్తుంటే ఇది మీకోసమే.. కాంపాక్ట్ కార్లలో స్టయిల్, మైలేజ్, యాక్టివిటీ కోసం కాంపాక్ట్ SUV కార్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 2025లో చాలా కంపెనీలు ఫ్యామిలీ కస్టమర్ల కోసం సేఫ్టీ, సౌకర్యం, ప్రీమియం ఫిట్-అండ్-ఫినిష్ అత్యాధునిక టెక్నాలజీతో కొత్త అప్‌గ్రేడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లను లాంచ్ చేశాయి. హ్యుందాయ్ క్రెటా నుంచి హోండా ఎలివేట్ వరకు మీకు నచ్చిన ఫ్యామిలీ కారు ఏది కావాలో ఎంచుకోండి.

కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఫుల్ డిమాండ్ :
చిన్న ఫ్యామిలీలకు కారు లోపల స్పేస్ పరంగా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లలో అడ్వాన్స్ ఫీచర్లు మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది.

హ్యుందాయ్ క్రెటా :
క్రెటా కారు డిజైన్ పరంగా ఫ్యామిలీ కాంపాక్ట్ SUV. అత్యంత ప్రీమియం ఇంటీరియర్లు, చాలా సౌకర్యవంతమైన సీట్లు, ఎక్కువ గంటల ప్రయాణానికి అద్భుతంగా ఉంటాయి. 2025 మోడల్ అడ్వాన్స్ ADAS టెక్నాలజీపై భారీ టచ్ స్క్రీన్ వెంటిలేటెడ్ సీటింగ్, 360-డిగ్రీల కెమెరా అందిస్తుంది. CNG, పెట్రోల్ లేదా డీజిల్‌తో సంబంధం లేకుండా కారు కచ్చితంగా ఫ్యామిలీ అనేక అవసరాల బడ్జెట్‌కు సరిపోయే అన్ని ఆప్షన్లతో వస్తుంది.

కియా సెల్టాస్ :
లేటెస్ట్ కియా సెల్టాస్ హై-టెక్‌తో స్పెసిఫికేషన్‌లు, అడ్వాన్స్ డిజైన్‌ కలిగి ఉంది. చిన్న ఫ్యామిలీలకు తగినట్లుగా అన్ని ఫీచర్లు ఉన్నాయి. లోపల, స్పోర్టి అడ్వాన్స్ అట్రాక్టివ్ డిజైన్ కలిగి ఉంది. 2025 సెల్టోస్ కోసం సేఫ్టీపరంగా అనేక అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్ అప్‌డేట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ కారు చాలా అద్భుతంగా ఉంటుంది. హైవేలపై వేగంగా దూసుకెళ్లగలదు. మంచి మైలేజీని కూడా అందిస్తుంది.

Read Also : Google Pixel 10 Price : అమెజాన్‌లో కళ్లుచెదిరే డిస్కౌంట్.. పిక్సెల్ 10 ఫోన్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్!

టాటా నెక్సన్ :
చిన్న ఫ్యామిలీకి టాటా నెక్సాన్ కారు బెస్ట్. ఈకారులో GNCAP 5-స్టార్ రేటింగ్ కలిగి ఉంది. సేఫేస్ట్ కార్లలో ఒకటిగా చెప్పొచ్చు. 2025 నెక్సాన్‌కు అప్‌గ్రేడ్ పరంగా కొత్త స్టైలింగ్, భారీ స్క్రీన్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ అడాస్, ఎలక్ట్రిక్ మోడల్ వంటివి అత్యంత ఆకర్షణగా నిలిచాయి. మైలేజీ, మెయింట్‌నెన్స్ ఖర్చుల విషయానికొస్తే నెక్సాన్ కచ్చితంగా బడ్జెట్-ఫ్రెండ్లీ ఫ్యామిలీకి సరిగ్గా సరిపోయేలా ఉంటుంది.

మారుతి సుజుకి బ్రెజ్జా :

మారుతి సుజుకి బ్రెజ్జా కార్లు తక్కువ బడ్జెట్‌లో ఫ్యామిలీ కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంటాయి. మీ పెట్టుబడికి తగిన వాల్యూ అందించేలా ఉంటాయి. 2025 బ్రెజ్జాలో కొత్త హైబ్రిడ్ ఇంజిన్, రివర్స్ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే మెరుగైన క్యాబిన్ క్వాలిటీ అప్‌గ్రేడ్ అందిస్తుంది. మారుతి కార్లలో అందించే ఈ సర్వీసు ఏ ఫ్యామిలీ కస్టమర్లకు అయినా సరిపోయ్యేలా ఉంటుంది.

రెనాల్ట్ కిగర్ :
ఈ రెనాల్ట్ కిగర్ SUV కార్లలో ఇదొకటి. వైడ్ స్పేస్ కలిగి ఉంటుంది. ఆకట్టుకునేలా ఇంటీరియర్స్ కలిగి ఉంది. డిజిటల్ క్లస్టర్ అప్‌గ్రేడ్ చేసిన సస్పెన్షన్‌తో టర్బో ఇంజిన్ ఆప్షన్‌తో ఫ్యామిలీ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటుంది.

హోండా ఎలివేట్ :
ఈ హోండా ఎలివేట్ కారు అత్యంత ఆకర్షణీయమైన డిజైన్, సీటింగ్ కంపర్ట్‌గా కూర్చొనేలా ఉంటుంది. 2025లో కొత్త హోండా ఎలివేట్ కొనేందుకు అనేక మంది ఆసక్తి చూపారు. కచ్చితంగా ఫ్యామిలీ వినియోగదారులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రీమియం లుక్‌తో చిన్న ఫ్యామిలీలకు సరిగ్గా సరిపోయే కారు అని చెప్పొచ్చు.

బెస్ట్ మినీ ఫ్యామిలీ SUV ఏది? :
ఈ రెండు హ్యుందాయ్ క్రెటా, కియా, సెల్టోస్‌లలో ఫీచర్ సెట్‌లతో ప్రీమియం క్యాబిన్‌లను పొందవచ్చు. మైలేజ్ బడ్జెట్‌ కోసమైతే మారుతి బ్రెజ్జా, రెనాల్ట్ కిగర్ కార్లను ఎంచుకోవచ్చు.