Apple iPhone 18 Pro : ఆపిల్ కొత్త ఐఫోన్ 18 ప్రో వస్తోందోచ్.. ఫీచర్లపై భారీ అంచనాలు.. ప్రీ-ఆర్డర్లు ఎప్పటినుంచంటే?
Apple iPhone 18 Pro : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోంది.. సెప్టెంబర్ 9న 'సర్ప్రైజ్ అండ్ షైన్' ఈవెంట్ సందర్భంగా ఈ ఐఫోన్ మోడల్ లాంచ్ కానుంది. సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.
- Sreehari A
- Updated on- August 29, 2026 / 03:01 PM IST
Apple iPhone 18 Pro
- సెప్టెంబర్ 9న సర్ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్
- ఐఫోన్ 18 ప్రో సిరీస్ లాంచ్ కాబోతుంది
- సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-ఆర్డర్లు అందుబాటులోకి
Apple iPhone 18 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? మీకోసం ఐఫోన్ 18 ప్రో సిరీస్ రాబోతుంది. మీరు ఆపిల్ అభిమాని అయితే ఇది మీకోసమే.. త్వరలోనే నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్లు రాబోతున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ రెండో వారంలో ‘సర్ప్రైజ్ అండ్ షైన్’ ఈవెంట్‌ను ఆపిల్ ధృవీకరించింది. లీక్‌ల ప్రకారం.. ఈ ఏడాది ఈవెంట్ అత్యంత ఆకర్షణీయంగా ఉండనుంది.
ఆపిల్ ఐఫోన్ అల్ట్రాతో పాటు ఫోల్డబుల్ ఐఫోన్, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఐఫోన్ 18 ప్రోలను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. కొత్త స్ప్లిట్ లాంచ్ వ్యూహంలో (Apple iPhone 18 Pro) భాగంగా ఐఫోన్ 18 లాంచ్ వచ్చే ఏడాది ప్రారంభానికి వాయిదా పడనుంది. ఐఫోన్ 18 ప్రో లాంచ్ ఈవెంట్ సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రెండు వారాల్లో ఐఫోన్ 18 ప్రో లాంచ్ :
సెప్టెంబర్ 9న సర్ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్ జరగనుందని ఆపిల్ ధృవీకరించింది. ఈ పుకార్లు నిజమైతే.. ఐఫోన్ 18 ప్రో సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-ఆర్డర్లకు అందుబాటులోకి వస్తుంది. కమర్షియల్ సేల్స్ సెప్టెంబర్ 18న ప్రారంభమవుతాయని సమాచారం. అయితే, ఈ వివరాలను ఆ బ్రాండ్ ఇంకా ధృవీకరించలేదు.
ఐఫోన్ 18 ప్రో స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 18 ప్రోలో టీఎస్ఎంసీ 2nm ప్రాసెస్‌పై ఆపిల్ A20 ప్రో చిప్‌సెట్, 12GB వరకు ర్యామ్‌తో అమర్చనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్‌లో ట్రిపుల్ 48MP రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ఇందులో మెకానికల్ వేరియబుల్ అపర్చర్‌తో ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రావైడ్ 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఈ ఐఫోన్ మోడల్ 1Hz నుంచి 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండొచ్చు.
డైనమిక్ ఐలాండ్ సైజు తగ్గొచ్చు. అలాగే, కొన్ని ఫేస్ ఐడీ పార్టులు, డిస్‌ప్లే కిందకు మారినట్లు సమాచారం. మెరుగైన కూలింగ్ భారీ బ్యాటరీ కోసం ఛాసిస్ కొద్దిగా మందంగా మారొచ్చు. ఈ ఫోన్‌లో సుమారు 4,288mAh బ్యాటరీ శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్‌తో ఆపిల్ కస్టమ్ C2 5G మోడెమ్ కూడా ఉంటుందని అంచనా..
భారత్‌లో ఐఫోన్ 18 ప్రో ధర (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో బేస్ వేరియంట్‌ను రూ. 1,39,999 ధరకు అందించనుంది. హైయర్ వేరియంట్‌ను సుమారు రూ. 1,60,000 ధరకు అందించనున్నట్టు సమాచారం. ఈ ఐఫోన్ మోడల్ డార్క్ చెర్రీ, లైట్ బ్లూ, డార్క్ గ్రే సిల్వర్ వంటి వివిధ కలర్ ఆప్షన్లలో రానుంది.
