Apple iPhone 18 Pro Max : ఆపిల్ ఫ్యాన్స్ రెడీనా.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లాంచ్ ఎప్పుడు? లీకైన ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Apple iPhone 18 Pro Max Price : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ సెప్టెంబర్ 2026లో లాంచ్ కానుంది. ఐఫోన్ 18 ప్రో ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రాతో పాటుగా లాంచ్ అవుతుందని అంచనా . గత మోడల్ డిజైన్‌, పవర్ ఫుల్ A20 ప్రో చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు.

Apple iPhone 18 Pro Max

  • వచ్చే సెప్టెంబర్‌లో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ లాంచ్
  • ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర, లాంచ్ డేట్, ఫీచర్లు వివరాలివే
  • సెల్ఫీలు, వీడియో కాల్స్ 24MP ఫ్రంట్ స్నాపర్

Apple iPhone 18 Pro Max Price : ఆపిల్ ఐఫోన్ లవర్స్ గెట్ రెడీ.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ వచ్చేస్తోంది.. ఐఫోన్18 ప్రో, ఐఫోన్ అల్ట్రా (కంపెనీ ఫస్ట్ ఫోల్డబుల్) ఫోన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాయి.

ఐఫోన్ ప్రో మాక్స్ వేరియంట్ విషయానికి వస్తే.. గత మోడల్ మాదిరిగానే పవర్ ఫుల్ డివైజ్ గా రానుంది. బహుశా A20 ప్రో చిప్‌సెట్ కూడా ఉండొచ్చు. లీక్‌లు, పుకార్లు ఊహాగానాల ఆధారంగా రాబోయే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర, లాంచ్ డేట్, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

కెమెరా, డిజైన్, స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ మెయిన్ డిజైన్ అప్‌గ్రేడ్‌తో వస్తుంది. కొత్త కెమెరా ఐలాండ్ డిజైన్‌ అందిస్తుంది. ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో ఎలాంటి కొత్త డిజైన్ ఉంటుందో ఇప్పటివరకూ రివీల్ కాలేదు. నివేదికల ప్రకారం.. గత మోడల్ డిజైన్‌తోనే వస్తుందని అంచనా.

Read Also : Central Bank FD : సెంట్రల్ బ్యాంక్‌లో 24 నెలల FDపై ఎంత వడ్డీ వస్తుంది? సీనియర్ సిటిజన్లకు బెనిఫిట్స్ ఇవేనా?

కెమెరాల విషయానికొస్తే..
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 48MP ప్రైమరీ స్నాపర్, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ స్నాపర్ 48MP పెరిస్కోప్ టెలిఫోటో స్నాపర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 24MP ఫ్రంట్ స్నాపర్ ఉండవచ్చు.

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో రావచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ 3000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ ఉంటాయి. 2nm ప్రాసెస్‌పై ఆపిల్ A20 ప్రో చిప్‌సెట్‌తో పాటు ఆపిల్ సిక్స్ కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో రన్ చేయొచ్చు. ఈ ఫోన్‌లో 5400mAh బ్యాటరీతో పాటు 25W వైర్‌లెస్ మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చు.

లాంచ్ తేదీ, ధర ఎంత? (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 18, ఐఫోన్ ఫోల్డ్ ఐఫోన్ 18 ప్రోలతో పాటుగా 2026 సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 14 మధ్య లాంచ్ ఈవెంట్ జరుగుతుందని అంచనా. ధర విషయానికొస్తే.. లీకుల ప్రకారం 256GB ఇంటర్నల్ స్టోరేజీతో 12GB ర్యామ్ వేరియంట్ మార్కెట్లో రూ. 1,52,900 ధరకు లభ్యం కానుంది.