Apple iPhone 18 Pro Max
Apple iPhone 18 Pro Max : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. అతి త్వరలో ఆపిల్ నుంచి మరో కొత్త ఐఫోన్ రాబోతుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ కన్నా బెటర్ ఫీచర్లతో ఆపిల్ ఇప్పుడు ఐఫోన్ 18 ప్రో సిరీస్ తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాదిలో ఐఫోన్ ఫోల్డ్‌పైనే అందరి దృష్టిపడింది. ఐఫోన్ 18 ప్రో మాక్స్ కూడా అదిరిపోయే అప్‌గ్రేడ్‌లతో రానుందని అంచనా.
2026లో ఆపిల్ ఇంటెలిజెన్స్ కొన్ని డిజైన్ ట్వీక్‌లు, కెమెరా అప్‌గ్రేడ్‌లతో రానుంది. చిన్న డైనమిక్ ఐలాండ్, అండర్-డిస్‌ప్లే కెమెరాతో ఫ్రంట్ సైడ్ కొన్ని అప్‌గ్రేడ్స్ ఉండవచ్చు. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధర రేంజ్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ ప్రోమోషన్ టెక్నాలజీతో 6.9-అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుందని చెబుతున్నారు. 2nm ప్రాసెస్ ఆధారంగా A20 ప్రో చిప్ నుంచి పవర్ పొందుతుంది. ఈ ఐఫోన్ 40W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,100mAh బ్యాటరీ బ్యాకప్ ఉండవచ్చు. iOS27లో రన్ అవుతుందని లేటెస్ట్ లీక్‌లు సూచిస్తున్నాయి.
కెమెరా విషయానికొస్తే.. ఈ ఐఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరాతో రావచ్చు. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్, 4x ఆప్టికల్ జూమ్‌తో 48MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ మోడల్ 24MP ఫ్రంట్ కెమెరాతో రానుంది.
ఐఫోన్ 18 ప్రో మాక్స్ భారత్ లాంచ్ టైమ్‌లైన్ :
ఆన్‌లైన్‌లో లీక్‌ల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ ఫోల్డ్‌తో సెప్టెంబర్‌లో లాంచ్ కావచ్చని సూచిస్తున్నాయి. అయితే, ఐఫోన్ 18, ఐఫోన్ 18e వచ్చే ఏడాది అంటే 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
భారత్‌లో ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర (అంచనా) :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర 256GB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.1,54,900 ఉంటుందని అంచనా. ముఖ్యంగా హార్డ్‌వేర్ ధరలు పెరుగుతున్న ఈ సమయంలో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర కూడా భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి.