iPhone 18 Pro Series : ఐఫోన్ క్రేజే వేరు.. కొత్త ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు మాత్రం కిర్రాక్ భయ్యా.. ధర ఎంత ఉండొచ్చంటే?

iPhone 18 Pro Max vs iPhone 18 Pro : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ లాంచ్ కాబోతుంది. ఈ కొత్త ఐఫోన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 18 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి. డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్ వివరాలపై లుక్కేయండి..

iPhone 18 Pro Series

  • ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 6.9-అంగుళాల డిస్‌ప్లే అంచనా
  • ఐఫోన్ 18 ప్రో మోడల్‌లో 6.3-అంగుళాల డిస్‌ప్లే
  • ఈ 2 మోడళ్లలోనూ 48MP ప్రైమరీ కెమెరా ఆప్షన్లు
  • ఐఫోన్ 18 ప్రో ధర రూ. 1,34,900 ఉండవచ్చని అంచనా
  • ప్రో మాక్స్ మోడల్ ధర రూ. 1,54,900 మధ్య ఉండొచ్చు

iPhone 18 Pro Max vs iPhone 18 Pro : ఆపిల్ లవర్స్ కోసం అద్భుతమైన న్యూస్.. అతి త్వరలో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ రాబోతుంది. ఆపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్‌ లాంచ్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ రాబోయే ఐఫోన్ 18 సిరీస్ ఫోన్లకు సంబంధించి అనేక లీకులు, పుకార్లు వస్తున్నాయి.

రాబోయే ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, కెమెరా అప్ గ్రేడ్స్ సహా అనేక ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లతో వస్తాయని భావిస్తున్నారు. లీక్‌ల ఆధారంగా ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 18 ప్రోతో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

డిస్‌ప్లే, కెమెరాలు (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 6.9-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. ఐఫోన్ ప్రో మోడల్ 6.3-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. ఈ రెండు ఫోన్‌ల డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తాయి.

Read Also : Redmi 100-Inch TV : ఇంట్లోనే సినిమా థియేటర్ ఫీల్.. 100 అంగుళాల భారీ రెడ్‌మి స్మార్ట్‌టీవీ చూశారా? ధర తెలిస్తే షాక్ అవుతారు!

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ 2 మోడళ్లలో 48MP ప్రైమరీ కెమెరా, 48MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రా-వైడ్ షూటర్ ఉంటాయని అంచనా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 24MP కెమెరా ఉండవచ్చు.

పర్ఫార్మెన్స్, బ్యాటరీ (అంచనా) :
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 18 ప్రో రెండూ ఆపిల్ A20 ప్రో చిప్‌సెట్‌తో రన్ అవుతాయి. 12GB ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ అందిస్తుందని అంచనా. ప్రస్తుతానికి, బ్యాటరీ గురించి ఎలాంటి పుకార్లు లేవు. కానీ, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో ప్రో మోడల్ కన్నా భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.

ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఐఫోన్ 18 ప్రో : భారత్ ధరలు (అంచనా) :
భారత మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో ధర సుమారుగా రూ. 1,34,900 ఉంటుందని అంచనా. అలాగే ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్ ధర రూ. 1,54,900 నుంచి ఉండొచ్చు. ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఐఫోన్ 18 ప్రోకు సంబంధించి త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.