Apple iPhone Air Price : ఇదే బెస్ట్ టైమ్ మావా.. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ఇంత తక్కువకు మళ్లీ దొరకదు.. అమెజాన్‌లో జస్ట్..!
Apple iPhone Air Price Drop : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర భారీగా తగ్గిందోచ్.. ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ సమయంలో ఈ సన్నని ఐఫోన్ మోడల్ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Updated on- September 11, 2026 / 04:19 PM IST
Apple iPhone Air Price
- అమెజాన్‌లో ఐఫోన్ ఎయిర్ ధర భారీ తగ్గింపు
- ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే
- రూ. లక్ష లోపు ధరకే ఐఫోన్ ఎయిర్ మీ సొంతం
Apple iPhone Air Price Drop : ఆపిల్ లవర్స్ డోంట్ మిస్.. ఇంతకన్నా బెస్ట్ ఆఫర్ మళ్లీ రాదు.. లిమిటెడ్ టైమ్ డీల్.. అసలు మిస్ చేసుకోవద్దు.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ మార్కెట్లోకి వచ్చేసింది.
ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయో కూడా లాంచ్ అయింది. ఆపిల్ కంపెనీ ఐఫోన్ ఎయిర్ ధరలను భారీగా పెంచింది.
ఈ ఐఫోన్ బేస్ మోడల్ ప్రారంభంలో రూ. 1,19,900 ధర ఉండగా, ఇప్పుడు రూ. 30వేల ధర పెంపుతో రూ. 1,49,900కు అమ్ముడవుతోంది. అయితే, మీరు ఆపిల్ (Apple iPhone Air Price) అత్యంత సన్నని ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ. 1 లక్ష కన్నా తక్కువ ధరకే లభిస్తోంది.
ఈ ఐఫోన్ విషయంలో 6.5-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, A19 చిప్‌సెట్, బ్యాక్ సైడ్ 48MP ఫ్యూజన్ కెమెరా ఉన్నాయి. లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే.. అమెజాన్‌లో ఐఫోన్ ఎయిర్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో ఐఫోన్ ఎయిర్ డీల్ :
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర పెంపుతో ఇప్పుడు రూ. 149,900 ప్రారంభ ధరతో అమ్ముడవుతోంది. కానీ, ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ. 99,990కే అందుబాటులో ఉంది. కొత్త ధరపై రూ. 49,910 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఐఫోన్ కొనుగోలుపై అదనంగా రూ. 3వేలు కూడా ఆదా చేసుకోవచ్చు.
అమెజాన్‌లో నెలకు కేవలం రూ. 3,515 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా అందిస్తోంది. మీ ఐఫోన్ అప్‌గ్రేడ్ చేసుకుంటే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. మీ పాత ఐఫోన్ బ్రాండ్, మోడల్, పర్ఫార్మెన్స్ బట్టి రూ. 33,200 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. అదనంగా చెల్లిస్తే ఒక ఏడాదికి ఆపిల్ కేర్+ ప్రొటెక్షన్‌ను కూడా కొనేసుకోవచ్చు.
ఐఫోన్ ఎయిర్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్? :
ఐఫోన్ ఎయిర్‌పై ప్రస్తుత ధర తగ్గింపు ఇదే లాస్ట్చి కావచ్చు. ఎందుకంటే ఆపిల్ ఇటీవలే అనేక ఐఫోన్‌లు, ఇతర ప్రొడక్టుల ధరలను భారీగా పెంచేసింది. 2025లో లాంచ్ అయిన ఈ హ్యాండ్‌సెట్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది.
బయట ఫోన్ డిస్ ప్లే 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. అంటే.. డిస్ ప్లే కాంతిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆపిల్ A19 చిప్‌సెట్ నుంచి పవర్ పొందుతుంది. 12GB ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. సరికొత్త iOS 27 ఉన్న ఈ ఐఫోన్ కొత్త సిరి ఏఐ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3,100 mAh బ్యాటరీ, 20W వైర్డ్ ఛార్జింగ్, 12W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జర్ ఉన్నాయి. కెమెరాల విషయానికొస్తే.. బ్యాక్ సైడ్ 48MP ఫ్యూజన్ సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 18MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. మీరు నిజంగా ఐఫోన్ ఎయిర్ కొనాలనుకుంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే.. ఐఫోన్ ఎయిర్ ధర ఎప్పుడైనా మళ్లీ పెరగొచ్చు.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..
