Apple iPhone SE3 : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ కొత్త స్మార్ట్ ఫోర్ వస్తోంది. సరసమైన ధరకే మార్చి 2022లో అందుబాటులోకి రానుంది. ఆపిల్ కంపెనీ Apple iPhone SE3 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ కొత్త ఐఫోన్
SE3 మోడల్ ధర, ఫీచర్లకు సంబంధించి వివరాలను ఓ నివేదిక వెల్లడించింది. రాబోయే iPhone SE 3 2022 ప్రారంభ ధర $300 (దాదాపు రూ. 22,000)తో రావచ్చని మార్కెట్ విశ్లేషకుడు జాన్ డోనోవన్ అంచనా వేస్తున్నారు. ఐఫోన్ SE 3 ధర
iPhone SE 2020 కన్నా తక్కువ ధరకే అందబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
iPhone SE 3 ఫోన్ మెరుగైన ప్రాసెసర్, 5G సపోర్టుతో పాటు మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందించనుంది. మార్కెట్ విశ్లేషకుడు జాన్ డోనోవన్ ప్రకారం.. iPhone SE 3 సరసమైన ధరకే రావొచ్చునని అంటున్నారు. స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర
$300 (దాదాపు రూ. 22,000) ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఐఫోన్ SE 2020 ఫోన్ ధర iPhone SE 3 2022 కన్నా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
రాబోయే iPhone SE 3 మెరుగైన ప్రాసెసర్‌తో పాటు మెరుగైన కెమెరాలను కలిగి ఉంటుందని తెలిపారు. పాత డిజైన్‌ను కలిగి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. iPhone SE 3 iPhone SE 2020 మాదిరిగానే 4.7-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండవచ్చని ఇదివరకే ఫీచర్లు లీకయ్యాయి. A15 బయోనిక్ చిప్సెట్ పవర్ అందించనుంది. iPhone 13 చిప్సెట్ X60 మోడెమ్‌తో ఈ కొత్త ఐఫోన్ వచ్చే అవకాశం ఉంది.
iPhone SE 3 5G సపోర్టుతో 4GB RAM, 256GB స్టోరేజీ వరకు పెంచుకోవచ్చు. iPhone SE 3 మోడల్.. గతంలోని మోడల్ ఐఫోన్ల మాదిరిగా వెనుకవైపు ఒకే విధమైన 12-MP కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఫ్రంట్ సైడ్..
iPhone SE 3 8-MP కెమెరాతో వస్తుందని భావిస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే.. iPhone SE 2020 1821mAh బ్యాటరీతో రానుంది. iPhone SE 3 మెరుగైన బ్యాటరీ లైఫ్, పెద్ద బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
మార్చి లేదా ఏప్రిల్‌లో జరగనున్న Apple స్ప్రింగ్ ఈవెంట్లో iPhone SE 3 లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతే భారత్ మార్కెట్లో లాంచ్ కానుంది. గతంలో, iPhone SE 3 2022 ధర భారత మార్కెట్లో రూ. 40,000 కంటే తక్కువగా ఉండవచ్చని ఓ నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉంటే.. iPhone SE 2020 ఫోన్ భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ. 39,900కే లాంచ్ అయింది. Apple iPhone SE 3 2022ని మాత్రం ఆపిల్ కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Read Also : iPhone 13 Price Cut : అమెజాన్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్..!