ATM New Rules : ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక ATMలో డబ్బులు తీస్తే ఛార్జీల బాదుడే.. ఈ బ్యాంకుల కస్టమర్లు ఏం చేయాలంటే?

ATM New Rules : ఏప్రిల్ నుంచి HDFC బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఏటీఎం రూల్స్ మారనున్నాయి. ఎలా పడితే అలా ఏటీఎంలో డబ్బులు తీస్తామంటే కుదరదు. అలా తీస్తే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం.

ATM New Rules

  • ఏప్రిల్ 1 నుంచి ఏటీఎ కొత్త రూల్స్ అమల్లోకి
  • HDFC నుంచి PNB వరకు ఛార్జీల్లో భారీగా మార్పులు
  • ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్, క్యాష్ విత్ డ్రా, అదనపు లావాదేవీలపై ఛార్జీలు

ATM New Rules : ఏప్రిల్ 1, 2026 నుంచి HDFC బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఏటీఎం నిబంధనలలో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇందులో ఉచిత లావాదేవీలపై పరిమితి, క్యాష్ విత్ డ్రా పరిమితి, అదనపు లావాదేవీ ఛార్జీలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై వినియోగదారులు గతంలో కన్నా ఎక్కువగా ఏటీఎంలను వాడకపోవడమే మంచిది. ఎందుకంటే లిమిట్ దాటిన ఏటీఎం లావాదేవీలపై అదనపు ఛార్జీలు చెల్లించక తప్పదు.

ఏటీఎంలపై ఆధారపడేవారిపై ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. అదనపు ఛార్జీలు పడకుండా ఉండేందుకు క్యాష్ విత్‌డ్రాలు, బ్యాలెన్స్ చెకింగ్ లిమిటెడ్ గానే వాడాల్సి ఉంటుంది. ఇంతకీ ఏయే బ్యాంకులు ఏటీఎం నిబంధనలను మార్చాయో ఇప్పుడు చూద్దాం.

HDFC బ్యాంక్ ఏటీఎం ఛార్జీలు :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ యూపీఐ ద్వారా ఏటీఎం పేమెంట్లపై నిబంధనలు మార్చింది. యూపీఐ ఆధారిత కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్ (ICCW) ఇకపై సాధారణ ఏటీఎం లావాదేవీలుగానే లెక్కిస్తుంది. సేవింగ్స్, శాలరీ అకౌంట్లలో HDFC బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ఉచిత లావాదేవీలు ఉంటాయి.

ఇతర బ్యాంకుల ఏటీఎంలో మీరు మెట్రో నగరాల్లో 3, నాన్-మెట్రో నగరాల్లో 5 ఉచిత లావాదేవీలు చేయొచ్చు. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 23తో పాటు జీఎస్టీ కూడా వసూలు చేస్తుంది. గతంలో, యూపీఐ విత్‌డ్రాయల్స్‌ను విడిగా లెక్కించేవారు. కానీ, ఇప్పుడు ఫ్రీ లిమిట్‌లోనే యూపీఐ పేమెంట్లను చేర్చారు.

PNB బ్యాంక్‌ మార్పులివే :
PNB (పంజాబ్ నేషనల్ బ్యాంక్) పలు డెబిట్ కార్డులపై రోజువారీ క్యాష్ విత్‌డ్రా పరిమితిని తగ్గించింది. గతంలో రూ. లక్ష వరకు అనుమతించిన ప్లాటినం, గోల్డ్, బిజినెస్ కార్డులపై విత్ డ్రా ఇప్పుడు రూ. 50వేలకు తగ్గించారు. గతంలో రూ. 1.5 లక్షల పరిమితి ఉన్న సెలెక్ట్, సిగ్నేచర్ కార్డులపై లిమిట్ ఇప్పుడు రూ. 75వేలకు తగ్గించారు. కొన్ని కార్డులపై పరిమితి సగానికి తగ్గించింది.

Read Also : Samsung Galaxy S25 Ultra 5G : ఈ శాంసంగ్ S25 అల్ట్రా క్రేజే వేరబ్బా.. రేటు ఎంతైనా తెగ కొంటున్నారు.. ధర జస్ట్ ఎంతంటే?

బంధన్ బ్యాంక్ ఏటీఎం నిబంధనలు :
బంధన్ బ్యాంక్ ఉచిత లావాదేవీల సంఖ్యను మార్చింది. సొంత ఏటీఎంలలో ప్రతి నెలా 5 ఉచిత ఆర్థిక లావాదేవీలు, ఆర్థికేతర లావాదేవీలు, బ్యాలెన్స్ చెక్‌ వంటివి అన్ లిమిటెడ్ కొనసాగుతాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో (ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్) 3 ఉచిత లావాదేవీలు, మెట్రోయేతర నగరాల్లో 5 ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి.

ఈ పరిమితిని దాటాక బ్యాంకు నిబంధనల ప్రకారమే ఛార్జీలు వర్తిస్తాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఏటీఎం వాడకాన్ని తగ్గించి డిజిటల్ పేమెంట్లు చేసుకోవడం బెటర్. ఇకపై ఏటీఎంను అధికంగా వాడితే రూ. 23 ఛార్జీతో పాటు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంకు ఖాతాదారులు యూపీఐ, బ్యాంకు యాప్ లేదా వెబ్‌సైట్‌లో కొత్త లిమిట్స్, ఛార్జీలను చెక్ చేయండి. మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకు ఏటీఎంలను వాడితే జర జాగ్రత్త. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.