Pubg Battle Grounds
Battlegrounds Mobile India: ఇండియన్ వర్షన్‌లో రిలీజ్ అయిన పబ్‌జీ మొబైల్.. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా దాదాపు 3లక్షల 36వేల మంది ప్లేయర్లను బ్యాన్ చేసింది. డెవలపర్ క్రాఫ్టన్.. గేమ్స్ అఫీషియల్ వెబ్‌సైట్ లో జులై 30న, ఆగష్టు 5న జరిపిన డెవలప్‌మెంట్ వివరాలిలా ఉన్నాయి. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఇప్పటికే 48మిలియన్ డౌన్‌లోడ్స్‌కు మించి నమోదైయ్యాయి.
దీనిని బట్టి చూస్తే.. ఫస్ట్ ఫేజ్ దాదాపు సక్సెస్ అయినట్లే. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా యాపిల్ వెర్షన్ ఇండియాలో లాంచ్ చేస్తామని ప్రకటించిన క్రాఫ్టన్ డేట్ రివీల్ చేయలేదు.
నిషేధిత ప్రోగ్రామ్‌లను ఉపయోగించి.. చీట్ చేస్తూ గేమ్‌లో అడ్వాంటేజ్ పొందేందుకు కొందరు ప్రయత్నించినట్టు కంపెనీ గుర్తించింది. అలా గేమ్‌లో చీట్ చేసిన 3,36,736 మంది ప్లేయర్లను బ్యాన్ చేశారు. ఆ యూజర్లు గేమ్‌ను మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోకుండా.. ఇన్‌స్టాల్ చేసుకోకుండా పర్మినెంట్‌గా నిషేదించినట్లు ప్రకటించింది.