Best Deals on iPhone Models During Flipkart Big Diwali Sale 2024
Flipkart Big Diwali Sale 2024 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024 కొనసాగుతోంది. ఈ సేల్ భారతీయ వినియోగదారులందరికీ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 31న ముగుస్తుంది. ఈ సేల్ సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో సహా అనేక రకాల ప్రొడక్టులపై భారీ తగ్గింపు ధరతో అందిస్తోంది.
ఇందులో రిఫ్రిజిరేటర్‌లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్‌లు, అలాగే స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటివి పర్సనల్ గాడ్జెట్‌లు ఉన్నాయి. ఆపిల్, శాంసంగ్, రియల్‌మి, ఒప్పో, నథింగ్ లేదా మోటోరోలా వంటి ప్రముఖ బ్రాండ్‌ల ఫోన్‌లు మార్కెట్ ధరల కన్నా చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి. ఆపిల్ ఐఫోన్ మోడళ్లలో కొనుగోలు చేయగల బెస్ట్ డీల్స్ జాబితాను ఓసారి పరిశీలిద్దాం..
ఆపిల్ ఐఫోన్ సేల్ ధర తగ్గాలంటే కూపన్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ లేదా బ్యాంక్ ఆఫర్‌ల వంటి అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. ఎస్బీఐ కార్డ్, మాస్టర్ కార్డ్ హోల్డర్లు సేల్ సమయంలో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్లకు అర్హులు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. తక్కువ ధరకు పొందాలంటే ప్రొడక్టు పేజీలలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. గత సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయింది.
టాప్-ఆఫ్-లైన్ ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ 256జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 1,44,900కు అందిస్తోంది. ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్‌ను రూ. 1,30,410 తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 2023లో వచ్చిన ఈ ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ బేస్ 128జీబీ వేరియంట్ ధర రూ. 1,34,900కు అందిస్తోంది. ఈ వెర్షన్‌ను ఇప్పుడు రూ. 1,23,999కు అందుబాటులో ఉంది. వెనిలా ఐఫోన్ 13 పాత మోడల్ 128జీబీ వెర్షన్ ధర రూ. 79,900 ఉండగా ప్రస్తుతం ఇ-కామర్స్ సైట్‌లో ఇదే మోడల్ రూ. 49,990కు అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024 సందర్భంగా బెస్ట్ ఐఫోన్ డీల్స్ ఇవే :
ఐఫోన్ మోడల్స్ | ప్రారంభ ధర | తగ్గింపు ధర |
---|---|---|
ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ | రూ. 1,44,900 | రూ. 1,30,410 |
ఐఫోన్ 16ప్రో | రూ. 1,19,900 | రూ. 1,16,910 |
ఐఫోన్ 16 ప్లస్ | రూ. 89,900 | రూ. 80,910 |
ఐఫోన్ 16 | రూ. 79,900 | రూ. 71,910 |
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ | రూ. 1,59,900 | రూ. 1,18,900 |
ఐఫోన్ 15 ప్రో | రూ. 1,34,900 | రూ. 99,900 |
ఐఫోన్ 15 ప్లస్ | రూ. 89,900 | రూ. 63,900 |
ఐఫోన్ 15 | రూ. 79,900 | రూ. 55,900 |
ఐఫోన్ 14 | రూ. 79,900 | రూ. 50,900 |
ఐఫోన్ 13 | రూ. 79,900 | రూ. 49,900 |
Read Also : Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ పాత మోడల్ కొనాలా వద్దా?