Top Gaming Phones : గేమింగ్ కోసం కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 30 వేల లోపు ఈ 3 స్మార్ట్‌ఫోన్లు బెస్ట్! ఓ లుక్కేయండి!

Top Gaming Phones : రూ.30 వేల లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? నథింగ్ ఫోన్ (4బీ), రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ 5జీ, శాంసంగ్ గెలాక్సీ A36 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. ఈ ఫోన్ల ఫీచర్లు, ప్రాసెసర్, బ్యాటరీ, ధర ఎంత అనేది ఇప్పుడు చూద్దాం..

Best Gaming Phones Under 30000

  • BGMI, Free Fire ఆడేవారికి గుడ్ న్యూస్..
  • తక్కువ బడ్జెట్‌లో పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్లు..
  • 6000mAh బ్యాటరీతో అదిరిపోయే ఆప్షన్లు

Top Gaming Phones : స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడటం ఇష్టమా? బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వంటి భారీ గేమ్స్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడాలనుకుంటున్నారా? అయితే, రూ.30 వేల లోపు బడ్జెట్‌లో కొన్ని మంచి స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి.. పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, అమోల్డ్ డిస్‌ప్లేలు, లాంగ్ బ్యాటరీ సామర్థ్యంతో అత్యంతగా ఆకట్టుకుంటున్నాయి.. గేమింగ్ ఫోన్ల కోసం 3 ఫోన్ల వివరాలేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

నథింగ్ ఫోన్ (4b) :
అదిరిపోయే డిజైన్, క్లీన్ సాఫ్ట్‌వేర్ కోసం నథింగ్ ఫోన్ (4b) అదిరే ఆప్షన్. ఇందులో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. 6.77 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే, 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరాలు, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ముఖ్యంగా 6000mAh బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నథింగ్ ఫోన్ ధర రూ.49,999 నుంచి రూ.29,999కు తగ్గింది. ఎక్స్ఛేంజ్‌పై అదనంగా రూ.28,875 వరకు తగ్గింపు పొందవచ్చు..

Read Also : Home Loan Closed : హోమ్ లోన్ తీరిపోయిందా? బ్యాంకు ఈ పత్రాలు ఇవ్వకపోతే మీకు రోజుకు రూ.5,000 కట్టాల్సిందే!

రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ 5జీ :
ఎక్కువ ర్యామ్ స్టోరేజ్ కావాలంటే రెడ్ మి నోట్ 14 ప్రో ప్లస్ 5జీ అద్భుతమైన ఆప్షన్.. ఇందులో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ఉన్నాయి. 6.67 అంగుళాల డిస్‌ప్లే, 50MP + 50MP + 8MP ట్రిపుల్ రియర్ కెమెరాలు, 20MP సెల్ఫీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు.. 6200mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.36,999 నుంచి రూ.29,499కు తగ్గింది. ఎక్స్ఛేంజ్‌పై రూ.28,200 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A36 5జీ :
శాంసంగ్ లవర్స్ కోసం గెలాక్సీ A36 5జీ బెస్ట్ ఆప్షన్. ఇందులో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లే ఉన్నాయి. 50MP + 8MP రియర్ కెమెరాలు, 12MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.28,999 ఉండగా, ఎక్స్ఛేంజ్‌పై రూ.27,800 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.

మొత్తానికి రూ.30 వేల బడ్జెట్‌లో ఈ 3 ఫోన్లు అద్భుతమైన ఆప్షన్లుగా చెప్పొచ్చు.. అయితే, గేమింగ్ కోసం ఫోన్ కొనేముందు ప్రాసెసర్‌తో పాటు డిస్‌ప్లే, బ్యాటరీ, హీట్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలను కూడా చెక్ చేయాలి.. ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ తగ్గింపులు ఎప్పటికప్పుడూ మారే అవకాశం ఉంటుంది..