Best Mobiles 2025 : కొత్త ఫోన్ కావాలా? రూ. 30వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి!

Best Mobiles 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ మార్చిలో 2025లో రూ. 30వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Best Mobiles 2025 : కొత్త ఫోన్ కావాలా? రూ. 30వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి!

Best Mobiles 2025

Updated On : March 16, 2025 / 11:14 AM IST

Best Mobiles 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో ఈ మార్చి నెలలో రూ. 30వేల ధర విభాగంలో అద్భుతమైన ఆప్షన్లతో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

మార్కెట్లో మీ అవసరాన్ని బట్టి సరైన స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవడం కష్టమే. అందుకే అద్భుతమైన టాప్ 5 స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. వన్‌ప్లస్ 12R, పోకో X7 ప్రో, ఐక్యూ నియో 10R గేమింగ్‌ సహా రియల్‌మి 14 ప్రో ప్లస్, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి. పూర్తి ఫోన్ల లిస్టును ఓసారి లుక్కేయండి.

1) వన్‌ప్లస్ 12R :
వన్‌ప్లస్ 12R ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ (ProXDR) డిస్‌ప్లేను కలిగి ఉంది. డైనమిక్ 1-120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్, అడ్రినో 740 GPU ఉన్నాయి. గరిష్టంగా 16GB (LPDDR5X) RAM, 256GB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.

Read Also : BSNL Recharge Plan : వావ్.. వండర్‌ఫుల్.. BSNL అద్భుతమైన ప్లాన్ ఇదిగో.. ఒకసారి తీసుకుంటే.. 6 నెలలు రీఛార్జ్ చేయక్కర్లేదు..!

5,500mAh బ్యాటరీ 100W సూపర్‌వూక్ ఛార్జర్‌తో స్పీడ్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. ఈ కెమెరా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)తో కూడిన 50MP సోనీ IMX890 ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

2) ఐక్యూ నియో 10R :
ఐక్యూ నియో 10R ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. స్క్రీన్ 4,500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో 3,840Hz PWM డిమ్మింగ్, HDR10+ సర్టిఫికేషన్‌ను అందిస్తుంది. 4nm TSMC ప్రాసెస్‌పై నిర్మించిన స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌తో అమర్చి ఉంది.

ఈ ఐక్యూ ఫోన్ 1.7 మిలియన్లకు పైగా AnTuTu బెంచ్‌మార్క్ స్కోర్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5 గంటల వరకు 90fps గేమింగ్ మోడ్, 2,000Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, ఇ-స్పోర్ట్స్ మోడ్‌ను కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. బ్యాక్ కెమెరా సిస్టమ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP సోనీ ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి.

ఫ్రంట్ కెమెరా 32MP యూనిట్ కలిగి ఉంది. ఈ ఫోన్ 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. ఈ ఫోన్ 6,400mAh బ్యాటరీని కలిగి ఉంది. 7.98mm మందంతో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఐదు ఏళ్లు వాడకం తర్వాత కూడా బ్యాటరీ 80 శాతానికి పైగా హెల్త్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.

3) మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5G :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5జీ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇందులో 2.63 GHz సింగిల్ కోర్, 2.4 GHz ట్రై-కోర్, 1.8 GHz క్వాడ్-కోర్ కాన్ఫిగరేషన్‌తో కూడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్ సెటప్ ఉంది. 8GB ర్యామ్‌తో యూజర్లు మల్టీ టాస్కింగ్ కోసం వాడొచ్చు. ఈ ఫోన్ 6.7-అంగుళాల FHD+ P-OLED డిస్‌‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

గేమింగ్, స్ట్రీమింగ్ రెండింటికీ అనువైనది. ఫోటోగ్రఫీ ఔత్సాహికులు ఈ ఫోన్‌లో 50MP+13MP+10 MP ట్రిపుల్-కెమెరా రేంజ్ పొందవచ్చు. అయితే, 50MP ఫ్రంట్ కెమెరా హై క్వాలిటీ సెల్ఫీలను అందిస్తుంది. టర్బో పవర్ ఛార్జింగ్, USB టైప్-C పోర్ట్‌తో కలిపి 4500mAh బ్యాటరీతో పవర్ మేనేజ్‌మెంట్, స్పీడ్ ఛార్జింగ్‌ను అందిస్తుంది.

4) పోకో X7 ప్రో :
పోకో X7 ప్రో 5G ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iతో ప్రొటెక్షన్ అందిస్తుంది. 6.73-అంగుళాల అమోల్డ్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 3200 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది.

గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇన్‌స్టంట్ 2560Hz రేటుతో వస్తుంది. 4nm TSMC ప్రాసెస్‌పై రూపొందిన మీడియాటెక్ డైమన్షిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ ద్వారా ఆధారితమైనది. పోకో X7 ప్రో 5జీ, 3.25GHz వరకు క్లాక్ స్పీడ్‌లను అందుకోగలదు.

LPDDR5X మెమరీ, UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ సాలిడ్ ఎలక్ట్రోలైట్ టెక్నాలజీని ఉపయోగించి 6550mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. 90W హైపర్‌ఛార్జ్‌కు సపోర్టు ఇస్తుంది. దాదాపు 47 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయొచ్చు.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. పోకో X7 ప్రో 5జీలో f/1.59 ఎపర్చర్‌తో 50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్టు ఉంది. అల్ట్రా-వైడ్ కెమెరా 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8MP, ఫ్రంట్ కెమెరా 20MP కలిగి ఉంది. ఈ ఫోన్ 60fps వద్ద 4K వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

5) రియల్‌మి 14 ప్రో+ 5G :
రియల్‌‌మి 14ప్రో ప్లస్ 5జీ ఫోన్ 2800×1272 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1500నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్ ద్వారా ఆధారితమైనది. 8జీబీ లేదా 12జీబీ ర్యామ్ కాన్ఫిగరేషన్‌లలో 128జీబీ, 256జీబీ లేదా 512జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది.

ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 120x డిజిటల్ జూమ్ వరకు సామర్థ్యం ఉన్న 50MP పెరిస్కోప్ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీల విషయానికి వస్తే.. 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. 6000mAh బ్యాటరీ 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అదనపు ఫీచర్లలో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68/IP69 రేటింగ్, టెంపరేచర్ బట్టి కలర్ మారే బ్యాక్ ప్యానెల్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌‌మి యూఐ 6.0 ఫీచర్లు ఉన్నాయి.

Read Also : Crows Fall : ‘విరూపాక్ష’ సీన్ రిపీట్.. ఆ ఊళ్లో ఏం జరుగుతోంది..? గాల్లో ఎగురుతూ టప్ మని కిందపడి కాకులు మృతి..!

ఇంతకీ ఏ ఫోన్ కొనాలి? :
మీరు రూ. 30వేల లోపు పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటే.. వన్‌ప్లస్ 12ఆర్, పోకో X7 ప్రో, ఐక్యూ నియో 10ఆర్ ఫోన్లు అన్నీ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌లతో వచ్చాయి. అయితే, టెలిఫోటో కెమెరా కోరుకునే యూజర్లు ఈ విభాగంలో కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి.

రియల్‌మి 14 ప్రో ప్లస్, మోటోరోలా ఎడ్జ్ 50ప్రో వంటి ఫోన్లు ఉన్నాయి. మన్నిక పరంగా పరిశీలిస్తే.. పోకో X7 ప్రో, రియల్‌మి 14ప్రో ప్లస్ IP68, IP69 రేటింగ్‌తో వస్తాయి. అయితే, మోటోరలా IP68 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లు నీటిలో పడినా తట్టుకోగలవు. ఎలాంటి డ్యామేజ్ ఉండదు.