BSNL Recharge Plan : వావ్.. వండర్‌ఫుల్.. BSNL అద్భుతమైన ప్లాన్ ఇదిగో.. ఒకసారి తీసుకుంటే.. 6 నెలలు రీఛార్జ్ చేయక్కర్లేదు..!

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే 6 నెలల పాటు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అన్‌లిమిటెడ్ కాలింగ్స్, డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.

BSNL Recharge Plan : వావ్.. వండర్‌ఫుల్.. BSNL అద్భుతమైన ప్లాన్ ఇదిగో.. ఒకసారి తీసుకుంటే.. 6 నెలలు రీఛార్జ్ చేయక్కర్లేదు..!

BSNL Recharge Plan

Updated On : March 15, 2025 / 11:48 PM IST

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. నెలవారీ ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లతో విసిగిపోయారా? తక్కువ ధరకే దీర్ఘకాలిక వ్యాలిడిటీ ఆప్షన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్ ఒకటి తీసుకొచ్చింది. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ 6 నెలల వ్యాలిడిటీతో వచ్చే బడ్జెట్-ఫ్రెండ్లీ రూ. 750 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం టెలికం మార్కెట్లో అత్యంత సరసమైన లాంగ్ టైమ్ రీఛార్జ్ ఆప్షన్లలో ఒకటిగా నిలిచింది.

Read Also : Mutual Funds Loans : మ్యూచువల్ ఫండ్ నుంచి రుణాలు తీసుకోవచ్చా? రిస్క్ ఏమైనా ఉంటుందా? ప్రయోజనాలేంటి? కలిగే నష్టాలేంటి?

లాంగ్ వ్యాలిడిటీ.. రూ. 750 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ GP2 యూజర్ల కోసం ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. మునుపటి ప్లాన్ గడువు ముగిసిన 7 రోజుల్లోపు మొబైల్ నంబర్‌లను రీఛార్జ్ చేయని కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. 180 రోజుల వ్యాలిడిటీతో యూజర్లు రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఇకపై మొబైల్ నంబర్ డీయాక్టివేట్ కావడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ :

  • బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 750 ప్లాన్‌లో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి.
  • 180 రోజుల పాటు అన్ని లోకల్ ఎస్టీడీ నెట్‌వర్క్‌లకు అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్
  • రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్, అదనపు ఖర్చు లేకుండా కనెక్ట్  అవ్వొచ్చు.
  • 1GB రోజువారీ డేటా, లిమిట్ తర్వాత డేటా స్పీడ్ తగ్గుతుంది.
  • ఈ ప్లాన్ 180GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది.
  • మొత్తం వ్యాలిడిటీలో రోజుకు 1జీబీని పొందవచ్చు.
  • రోజువారీ డేటా లిమిట్ తర్వాత 40kbps ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయవచ్చు.

ప్రైవేట్ టెల్కోలతో పోటీగా :
ఈ కొత్త ఆఫర్‌తో బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్‌ల కన్నా దీర్ఘకాలిక వ్యాలిడిటీని ఇష్టపడే కస్టమర్‌లను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాన్ ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా వంటి ఇలాంటి ఆఫర్‌లతో పోటీగా అందుబాటులోకి వచ్చింది.

Read Also : SIP Investments : మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా జస్ట్ రూ.1000 ఆదా చేయండి.. 20 ఏళ్లలో రూ.10 లక్షలపైనే సంపాదించుకోవచ్చు!

వినియోగదారులకు కనెక్టివిటీ పరంగా ఎలాంటి అంతరాయం లేకుండా అందిస్తుందని భావిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ యూజర్లకు హోలీ పండుగకు ముందు ఈ సరసమైన లాంగ్ టైమ్ రీఛార్జ్ ప్లాన్ అందించింది. ఆరు నెలల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొబైల్ ప్లాన్ కోసం చూస్తుంటే రూ. 750 బీఎస్ఎన్ఎల్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.