×
Ad

Best Vivo Camera Phones : ఈ 5 వివో కెమెరా ఫోన్లు వేరే లెవెల్.. ఫొటోగ్రఫీ లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్లు.. ఫస్ట్ ఫోన్ రేంజే వేరబ్బా..!

Best Vivo Camera Phones : వివో నుంచి సరికొత్త టాప్ మోడల్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఫొటోగ్రఫీ లవర్స్ ఈ 5 వివో ఫోన్లలో ఏది కొంటారో కొనేసుకోండి.

Best Vivo Camera Phones

Best Vivo Camera Phones : కొత్త వివో స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రత్యేకించి ఫొటోగ్రఫీ లవర్స్ కోసం అద్భుతమైన టాప్ వివో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో కెమెరా ఫోన్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. కెమెరా ప్రొఫెషనల్‌గా ఉంటాయని చాలామంది వివో లవర్స్ ఈ వివో ఫోన్లనే తెగ కొనేస్తున్నారు.

కెమెరా క్వాలిటీ పరంగా తగ్గేదేలే (Best Vivo Camera Phones) అన్నట్టుగా ఉన్నాయి. 2025లో ఫొటోగ్రఫీని ఇష్టపడే యూజర్ల కోసం బెస్ట్ కెమెరా ఫోన్లను కొనేసుకోవచ్చు. మీరు ఫొటోలు లేదా సోషల్ మీడియా కోసం కంటెంట్‌ క్రియేట్ చేసేందుకు ఈ వివో ఫోన్‌లు అద్భుతంగా ఉంటాయి.. మీరు కూడా వివో ఫోన్ కొనేందుకు చూస్తుంటే టాప్ వివో మోడల్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

వివో X90 ప్రో :
వివో X90 ప్రోలో బ్యాక్ కెమెరా కూడా ఉంది. 200MP మెయిన్ సెన్సార్ సిస్టమ్‌తో వస్తుంది. డే టైమ్, నైట్ ఫోటోగ్రఫీలో సమానంగా ఫొటోలను జనరేట్ చేస్తుంది. ఈ ఫోన్‌లోని నైట్ మోడ్ మసక వెలుతురులో అద్భుతంగా కనిపిస్తుంది. అయితే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఏఐ కెమెరా ప్రతి షాట్ ప్రకారం సెట్టింగ్‌లలో ఆటోమాటిక్‌గా అడ్జెస్ట్ చేస్తుంది. మీ ఫొటోలకు ప్రొఫెషనల్ లుక్ అందిస్తుంది.

వివో V27 ప్రో :
సెల్ఫీ ప్రియులకు వివో V27 ప్రో ఫోన్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో 50MP ఫ్రంట్ కెమెరా, 64MP బ్యాక్ కెమెరా ఉన్నాయి. ఈ వివో ఫోన్‌లో కలర్ రీప్రొడక్షన్ రియల్‌గా ఉంటుంది. పోర్ట్రెయిట్‌లు, వైడ్-యాంగిల్ ఫొటోలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. 4K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. కంటెంట్ క్రియేటర్లకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

వివో V25 :

ఈ వివో V25 ఫోన్ కెమెరా ఫీచర్లు అద్భుతంగా ఉంటాయి. 64MP బ్యాక్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరాతో ఫొటోలు క్లిన్ హెచ్‌డీ క్వాలిటీతో వస్తాయి. ఈ వివో ఫోన్ లో-లైటింగ్‌తో కూడా ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. అందులోనూ ఏఐ పోర్ట్రెయిట్ కలర్ ఆప్షన్లలో ఫొటోలకు మరింత క్వాలిటీని అందిస్తుంది.

Read Also : Nothing Phone 4a Launch : మీరు రెడీనా? కొత్త నథింగ్ ఫోన్ 4a వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంత ఉండొచ్చంటే?

వివో Y100 :
వివో Y100 ఫోన్ ధరకు అద్భుతమైన కెమెరా ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. బ్యాక్ కెమెరా 50MP, ఫ్రంట్ కెమెరా 16MP కలిగి ఉంది. పగటిపూట ఫొటోలలో ఈ మొబైల్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఆకర్షణీయమైన ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ యూఐ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

వివో T2x :
వివో T2x మిడ్-రేంజ్ ఫోన్‌లలో ఫ్రంట్ సైడ్ 64MP, 16MP బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి సపోర్టు చేస్తాయి. ఇందులో నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, ప్లాంట్ HDR క్యాప్చరింగ్ వంటి అనేక కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ వివో ఫోన్ ఫొటోగ్రాఫర్లకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి.

ఫొటోగ్రఫీ పరంగా పరిశీలిస్తే ఈ వివో మోడల్స్ అత్యంత పాపులర్.. రిజల్యూషన్, సపోర్టింగ్ ఏఐ ఫీచర్లు లేదా ఆకట్టుకునే లో-లైటింగ్ పర్ఫార్మెన్స్ కావచ్చు. మీ అవసరాలను బట్టి బడ్జెట్ రెండింటికీ సరిపోయే బెస్ట్ ఫోన్ ఎంచుకోవచ్చు. మీరు తీసే ప్రతి షాట్ ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది.