BGMI Back India : బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా వీడియో గేమ్.. భారత్‌కు తిరిగి వచ్చేది అప్పుడే.. హింట్ ఇచ్చిన క్రాఫ్టన్..!
BGMI Back India : బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) త్వరలో భారత్‌కు తిరిగి రావచ్చని తెలుస్తోంది. ఈ మేరకు క్రాఫ్టన్ కంపెనీ కూడా హింట్ ఇచ్చింది. కొన్ని కొత్త ట్యుటోరియల్ వీడియోలను BGMI ఇండియా వెబ్‌సైట్‌లో కంపెనీ పోస్ట్ చేసింది.
- Sreehari A
- Published On : October 28, 2022 / 05:41 PM IST
BGMI could soon make a comeback in India, Krafton hints
BGMI Back India : బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) త్వరలో భారత్‌కు తిరిగి రావచ్చని తెలుస్తోంది. ఈ మేరకు క్రాఫ్టన్ కంపెనీ కూడా హింట్ ఇచ్చింది. కొన్ని కొత్త ట్యుటోరియల్ వీడియోలను BGMI ఇండియా వెబ్‌సైట్‌లో కంపెనీ పోస్ట్ చేసింది. సపోర్టు విభాగంలో BGMIకి సంబంధించి మొత్తం 4 కొత్త వీడియోలు ఉన్నాయి. వాటిలో కొన్ని కొన్ని గంటల క్రితం అప్‌లోడ్ అయ్యాయి. YouTubeలో ‘Krafton Player Support’గా పిలిచే కొత్త ఛానెల్‌ని క్రియేట్ చేసింది. ఆ ఛానెల్ సెప్టెంబర్ 29న క్రియేట్ అయింది. ఇప్పుడు కొత్త వీడియోలు అప్‌లోడ్ అయ్యాయి. ఈ BGMI గేమ్ త్వరలో తిరిగి వస్తుందని Krafton కంపెనీ సూచిస్తోంది. అయితే, ఈ వీడియోలు ఛానెల్‌లో కనిపించవు. అంటే అవి పబ్లిక్ కోసం లిస్టు చేయలేదు.
ఎవరైనా యూజర్లు వెళ్లి BGMI వెబ్‌సైట్‌లోని సపోర్ట్ సెక్షన్ లోని వీడియోలను చెక్ చేయవచ్చు. ఆ వీడియోలు ఎప్పుడో పోస్ట్ చేసినట్టు సైట్ చూపిస్తోంది. అకౌంట్లో అన్‌లింక్ చేయడం, డిలీట్ చేయడం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. BGMI యూజర్లకు నివేదించడం, స్నేహితులను బ్లాక్ చేయడం లేదా యాడ్ చేసేందుకు అనేక వీడియోలు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుతానికి, BGMI ప్రారంభంపై క్రాఫ్టన్ ఎలాంటి అధికారిక ధృవీకరించేలేదు. కానీ, లేటెస్ట్ BGMI ఫ్యాన్స్ కోసం ఇంకా త్వరలో అందుబాటులోకి రావొచ్చుని సూచిస్తుంది. భారత్‌లో టెక్నికల్ గురూజీగా ప్రసిద్ధి చెందిన గౌరవ్ చౌదరి తన వీక్లీ టెక్ ఫోకస్ యూట్యూబ్ వీడియో సిరీస్ 12వ ఎపిసోడ్‌లో BGMI ఈ ఏడాది చివరి నాటికి తిరిగి రావచ్చని పేర్కొన్న కొద్ది వారాలకే లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది.
BGMI could soon make a comeback in India, Krafton hints
చాలా కాలంగా బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా వీడియో గేమ్ తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాు. BGMI 2022 చివరి నాటికి లేటెస్ట్ అవతార్‌లో తిరిగి రావచ్చునని ఆయన చెప్పారు. ఇండియాలోని ఎస్పోర్ట్స్ కమ్యూనిటీలోని మరో ప్రముఖ యూట్యూబర్, పియూష్ ‘స్పెరో’ బాత్లా, డిసెంబర్ 2022లోపు గేమ్ రాదని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మళ్లీ అందుబాటులోకి రావచ్చని ఆ వీడియోలో సూచించారు. ఒరంగుటాన్ గేమింగ్ నుంచి AKOP, 2023 మధ్య నాటికి BGMI వచ్చే అవకాశం ఉందని Instagram లైవ్ వీడియోలో కనిపించింది.
బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా త్వరలో వస్తుందని, అయితే కొత్త భారతీయ కంపెనీ ద్వారా లాంచ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆయన సూచించారు. గేమ్ పేరు మారే అవకాశం ఉందని, అదే పేరుతో అందుబాటులో ఉండదని చెప్పారు. భారత ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌ను నిషేధించింది. ఆ గేమ్ వెంటనే Google Play Store, Apple సొంత App Store నుండి తొలగించాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A కింద బ్లాక్ చేసింది. అదే చట్టం ప్రకారం రెండేళ్ల క్రితం PUBG మొబైల్, టిక్‌టాక్ రెండు దేశంలో బ్యాన్ అయ్యాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
