Elon Musk Twitter Takeover: యజమానులు ఎవరైనా సరే.. దేశ చట్టాలను అనుసరించాల్సిందే.. స్పష్టం చేసిన భారత్
ట్విటర్‌లో నిషేధం ఎదుర్కొంటున్న వారి గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. అతి త్వరలో సవరణ చేసిన కొత్త ఐటీ నిబంధనలు విడుదల చేస్తామని తెలిపారు.

Elon Musk's takeover of Twitter
Elon Musk Twitter Takeover: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం విధితమే. ట్విటర్ లో పలు కీలక మార్పులు చేసేందుకు మస్క్ సిద్ధమవుతున్నారు. నిన్నటి వరకు ట్విటర్ లో పరిధిదాటి విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసేవారి ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేసిన విషయం విధితమే. తాజాగా, ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసిన తరువాత విద్వేషపూరిత వ్యాఖ్యలకు అడ్డుకట్ట వేసే విషయంలో కొంత వెసులుబాటు కల్పించేలా నిబంధనలు మార్పుచేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై భారత ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. యాజమానులు ఎవరైనా సరే దేశ చట్టాలను అనుసరించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న, నకిలీ వార్తలను ప్రసారం చేసేలా ఉన్న కొన్ని కంటెంట్లను, ఖాతాలను ట్విటర్ నుంచి తొలగించాలని గతంలో పలుసార్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందన్న విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. అయితే వాటిని తొలగించేందుకు ట్విటర్ అంగీకరించడం లేదని కేంద్రం కొంతకాలంగా పేర్కొంటుంది. వాటిని సామాజిక మాధ్యమం అంగీకరించడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. ఇది ప్రభుత్వం, సామాజిక మాధ్యమ సంస్థ మధ్య విబేధాలకు దారితీసింది.
Elon Musk: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్ తొలగింపు
అయితే, ట్విటర్‌లో నిషేధం ఎదుర్కొంటున్న వారి గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై మీడియా ప్రశ్నించగా.. అతి త్వరలో సవరణ చేసిన కొత్త ఐటీ నిబంధనలు విడుదల చేస్తామని తెలిపారు.