Hyundai Cars Discounts : ఈ ఫిబ్రవరిలో హ్యుందాయ్ కార్లపై రూ.50వేల వరకు భారీ డిస్కౌంట్లు.. ఏ మోడల్ ధర ఎంత తగ్గిందంటే?
Hyundai Cars Discounts : ఫిబ్రవరి 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా నిర్దిష్ట మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తుంది. గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ నుంచి ఆరా కాంపాక్ట్ సెడాన్ వరకు భారీ తగ్గింపు పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published On : February 7, 2024 / 04:49 PM IST
Big discounts of up to Rs 50k on Hyundai cars in Feb 2024_ Details
Hyundai Cars Discounts : 2024 జనవరిలో దేశీయ మార్కెట్లో అత్యధిక విక్రయాలను నమోదు చేసిన తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా నిర్దిష్ట మోడళ్లపై రూ. 50వేల వరకు గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. లభ్యత, ప్రాంతం, మోడల్ వేరియంట్ ఆధారంగా వాస్తవ తగ్గింపు మారుతుందని గమనించాలి. కచ్చితమైన వివరాల కోసం మీ స్థానిక డీలర్‌ను సంప్రదించండి. ఈ కార్లలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ , అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన గ్రాండ్ ఐ10 నియోస్ వంటి మోడల్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 2024లో అందంచే ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఓసారి పరిశీలిద్దాం.
సీఎన్‌జీ వేరియంట్‌ల కోసం రూ. 20వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3వేల కార్పొరేట్ డిస్కౌంట్ సహా రూ. 33వేల వరకు తగ్గింపును పొందండి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT) ట్రిమ్‌లు (నాన్-CNG) రూ. 15,000 క్యాస్ డిస్కౌంట్ పొందగా, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (AT) వేరియంట్‌లు రూ. 5వేల తగ్గింపును పొందుతాయి. ఇతర బెనిఫిట్స్ అన్ని వేరియంట్‌లలో ఒకే విధంగా ఉంటాయి.
హ్యుందాయ్ ఆరా :
హ్యుందాయ్ ఆరా కాంపాక్ట్ సెడాన్‌పై ఆకర్షణీయమైన తగ్గింపులను కూడా అందిస్తోంది. సీఎన్‌జీ వేరియంట్‌లు రూ. 20వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3వేల కార్పొరేట్ డిస్కౌంట్ సహా మొత్తం రూ. 33వేలు తగ్గింపును పొందవచ్చు. నాన్-సీఎన్‌జీ ట్రిమ్‌లు రూ. 5వేల వరకు ముందస్తు తగ్గింపుతో పాటు రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3వేల కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.
హ్యుందాయ్ ఐ20 :
హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు మోడల్ రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్, ఎంటీ వేరియంట్ ధర రూ. 15వేల క్యాష్ డిస్కౌంట్ పొందుతుంది. మరోవైపు, ఐవీటీ ట్రిమ్ కేవలం రూ. 10వేల ఎక్స్చేంజ్ బోనస్‌ను కూడా పొందుతుంది. 1.2 కప్పా ఎంటీ ట్రిమ్ మొత్తం రూ. 20వేల తగ్గింపుతో పొందవచ్చు. ఇందులో రూ. 10వేల ముందస్తు తగ్గింపు, రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి.
హ్యుందాయ్ వెర్నా :
హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్టెడ్ వెర్నా సెడాన్ ఇప్పుడు స్టిక్కర్ ధరపై రూ. 15వేల తగ్గింపుతో పాటు రూ. 20వేల అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో వస్తుంది. ఈ ప్రోత్సాహకాలు రూ. 35వేల వరకు మొత్తం బెనిఫిట్స్ అందిస్తాయి. ఈ ఆఫర్‌లు సెడాన్ అన్ని వేరియంట్‌లలో చెల్లుబాటు అవుతాయి.
Big discounts on Hyundai cars
హ్యుందాయ్ అల్కేజర్ :
హ్యుందాయ్ అల్కేజర్ ఎస్‌యూవీ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో గణనీయమైన రూ. 2వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఈ మోడల్‌కు రూ. 15వేల ముందస్తు క్యాష్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అయితే ఇందులోకార్పొరేట్ బోనస్‌లు లేవని గమనించాలి.
హ్యుందాయ్ టక్సన్ :
హ్యుందాయ్ ఫ్లాగ్‌షిప్ ఐసీఈ ఎస్‌యూవీ, టక్సన్, డీజిల్ వేరియంట్‌పై ప్రత్యేకంగా రూ. 50వేల తగ్గింపును అందిస్తుంది. అయితే, పెట్రోల్ వేరియంట్‌లకు ప్రస్తుతం ఏ ఇతర డిస్కౌంట్లు అందుబాటులో లేవు.
హ్యుందాయ్ వెన్యూ :
హ్యుందాయ్ వెన్యూ మోడల్ కారు 1.0-లీటర్ టర్బో డీసీటీ ట్రిమ్ ధర రూ. 25వేల వరకు తగ్గింపులను అందిస్తుంది. ఇందులో రూ. 15వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. మరోవైపు, 1.0-లీటర్ టర్బో ఎంటీ రూ. 20వేల క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ. 10వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు.
