Lava Agni 4 : లావా అగ్ని 4పై భారీ డిస్కౌంట్.. 50MP కెమెరా ఫోన్ అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్..
Lava Agni 4 : లావా గత ఏడాదిలో లావా అగ్ని 4 లాంచ్ చేసింది. ప్రస్తుతం భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published On : April 11, 2026 / 07:46 PM IST
Lava Agni 4
- లావా అగ్ని 4 ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది.
- ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా ఉంది
- 5,000mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీ ఆప్షన్
Lava Agni 4 : కొత్త లావా ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? గత ఏడాదిలో లావా అగ్ని 4 లాంచ్ అయింది. అయితే, ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ లావా ఫోన్ కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. అగ్ని 4 మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 5,000mAh భారీ బ్యాటరీ ఉంది. లావా అగ్ని 4పై డీల్స్, ఆఫర్లు, స్పెసిఫికేషన్లపై ఓసారి లుక్కేయండి.
లావా అగ్ని 4 ధర, ఆఫర్లు :
లావా అగ్ని 4 ఫోన్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 24,999 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 2,500 తగ్గింపు లభిస్తోంది. అసలు ధర రూ. 22,499కి తగ్గుతుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా ధర రూ. 23,650 వరకు తగ్గించుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఫోన్, ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
లావా అగ్ని 4 స్పెసిఫికేషన్లు :
లావా అగ్ని 4 ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. అగ్ని 4, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అగ్ని 4లో 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 5,000mAh బ్యాటరీ ఉంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. అగ్ని 4లో OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, OTG సపోర్ట్, GPS, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
లావా అగ్ని 4 డిస్‌ప్లే ఏంటి? :
లావా అగ్ని 4 ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది.
లావా అగ్ని 4లో ప్రాసెసర్ ఏంటి? :
లావా అగ్ని 4లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌ను అందించారు.
లావా అగ్ని 4 బ్యాటరీ :
లావా అగ్ని 4 లో 5,000mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీ ఉంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
లావా అగ్ని 4 కెమెరా ఫీచర్లు :
లావా అగ్ని 4లో OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, బ్యాక్ సైడ్ ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.
