Redmi Turbo 5 : గేమింగ్ ఫోన్ కావాలా? ఈ రెడ్‌మి ఫోన్‌ అతి చౌకైన ధరకే.. ఇలా కొన్నారంటే?

Redmi Turbo 5 : కొత్త రెడ్‌మి ఫోన్ కొనేవారికి ఇదే బెస్ట్ టైమ్.. 7540mAh బ్యాటరీ 50MP కెమెరాతో అతి చౌకైన ధరకే కొనేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Redmi Turbo 5

  • రెడ్‌మి టర్బో 5లో 6.59-అంగుళాల 1.5K ఫ్లూయిడ్ డిస్‌ప్లే
  • బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా సెటప్
  • రెడ్‌మి టర్బో 5లో 7540mAh బ్యాటరీ సెటప్

Redmi Turbo 5 : కొత్త రెడ్‌మి ఫోన్ కొనాలని చూసేవారికి గుడ్ న్యూస్.. రెడ్‌మి టర్బో 5 ఫోన్ భారీగా తగ్గింది. ఈ ఏడాది జూన్‌లో గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి టర్భో 5 ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది.

మీరు 50MP ప్రైమరీ కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌లో 7540mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమన్షిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ ఉన్నాయి. రెడ్‌మి టర్బో 5పై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రెడ్‌మి టర్బో 5 ధర, ఆఫర్లు :
రెడ్‌మి టర్బో 5 ఫోన్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,900 ధరకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై రూ. 1,898 తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర రూ. 36,005 అవుతుంది.

Read Also : Flipkart Free Netflix : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఇలా చేశారంటే ప్రతినెలా ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ చూడొచ్చు..!

రెడ్‌మి టర్బో 5 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి టర్బో 5లో 2712×1220 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల 1.5K ఫ్లూయిడ్ డిస్‌ప్లే అందిస్తుంది. ప్రొటెక్షన్ కోసం షావోమీ ప్రీమియం ఐ ప్రొటెక్షన్‌తో కూడా వస్తుంది.

టీయూవీ ట్రిపుల్ ఐ కేర్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66, IP68, IP69 IP69K రేటింగ్‌తో వస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే..
రెడ్‌మి టర్బో 5 ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. ఈ ఫోన్‌లో 7540mAh బ్యాటరీ ఉంది.

100W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి 2.0 పోర్ట్, NFC ఉన్నాయి.