Boltt Ace 5G And EVo : కొత్త బోల్ట్ Ace 5జీ, Evo ఫోన్లు వచ్చేశాయ్.. 6000mAh బ్యాటరీ, 8MP సెల్ఫీ కెమెరా అదుర్స్, ధర ఎంతంటే!
Boltt Ace 5G And EVo : బోల్ట్ కంపెనీ నుంచి ఏసీఈ 5జీ, ఈవీఓ అనే రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. 6000mAh బ్యాటరీ, 8MP ఫ్రంట్ కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- August 25, 2026 / 05:54 PM IST
Boltt Ace 5G And EVo
- బోల్ట్ ఏసీఈ, ఈవీఓలో 6.79-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
- 6000mAh బ్యాటరీ, 8MP ఫ్రంట్ కెమెరా సెటప్
- 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్, యూనిసోక్ టీ7250 ప్రాసెసర్
Boltt Ace 5G And EVo : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? బోల్ట్ కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. బోల్ట్ Ace 5G బోల్ట్ EVO ఫోన్లు లాంచ్ అయ్యాయి. బోల్ట్ ఏస్ 5జీ, ఈవీఓ 4జీ ఫోన్లు 720×1640 పిక్సెల్స్ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్ 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.79-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేతో ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ రెండు ఫోన్‌లలోనూ 6000mAh బ్యాటరీ ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బోల్ట్ ఏస్ 5జీ, బోల్ట్ EVO ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు (Boltt Ace 5G And EVo) సంబంధించి పూర్తి వివరాలివే..
బోల్ట్ ఏసీఈ 5జీ, ఈవీఓ ధర ఎంతంటే? :
బోల్ట్ ఏస్ 5జీ ఫోన్ 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999, 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. బోల్ట్ ఈవో 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999, 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999గా ఉంది. ఈ 2 స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ సైట్‌లో తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి.
Read Also : iQOO Z11 Sale : ఐక్యూ Z11పై భారీ ఆఫర్.. ఫస్ట్ సేల్‌లో రూ.4వేల వరకు డిస్కౌంట్.. రూ.31,499కే సొంతం!
బోల్ట్ ఏసీఈ 5జీ, ఈవీఓ స్పెసిఫికేషన్లు :
బోల్ట్ ఏసీఈ 5జీ, ఈవీఓ 4జీ ఫోన్‌లు 720×1640 పిక్సెల్ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్ 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.79-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ రెండు ఫోన్‌లు 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6000mAh బ్యాటరీతో వస్తాయి. బోల్ట్ ఏసీఈ 5జీ ఫోన్ యూనిసోక్ టీ8200 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. బోల్ట్ ఈవీఓ 4జీలో యూనిసోక్ టీ7250 ప్రాసెసర్ ఉంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. బోల్ట్ ఏసీఈ 5జీ బ్యాక్ సైడ్ F1.8 అపర్చర్‌తో 64MP ప్రైమరీ కెమెరా ఉండగా, ఈవీఓ 4జీ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ రెండు ఫోన్‌లలో F2.0 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. కొలతల పరంగా పరిశీలిస్తే.. బోల్ట్ ఏసీఈ 5జీ ఫోన్ 77.71 మిమీ వెడల్పు, 8.5 మిమీ మందం, 170 మిమీ ఎత్తు ఉంటుంది. బరువు 233 గ్రాములు ఉంటుంది.
