BSNL Broadband Plan : కస్టమర్లకు పండగే.. 200Mbps స్పీడ్‌తో BSNL కొత్త ప్లాన్.. 5000GB డేటా, 27 OTT బెనిఫిట్స్ కూడా!

BSNL Broadband Plan : బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం 200Mbps వరకు స్పీడ్, 5000GB డేటాను అందించే కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ధర, బెనిఫిట్స్ వివరాలివే..

BSNL Broadband Plan

  • బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
  • ఒక్క ప్లాన్‌లో 200Mbps స్పీడ్, 5000GB డేటా బెనిఫిట్స్
  • అన్‌లిమిటెడ్ కాలింగ్, ధర, స్పీడ్, డేటా పూర్తి వివరాలివే

BSNL Broadband Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ప్లాన్.. సరికొత్త ప్లాన్‌ వచ్చేసింది. ఈ ప్లాన్ 200Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్‌ అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఈ వై-ఫై ప్లాన్ అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. ఇంటర్నెట్, ఫ్రీ కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్ కోరుకునే కస్టమర్లకు అద్భుతంగా ఉంటుంది.

రూ. 999 ప్లాన్ ఇదే :
బీఎస్ఎన్ఎల్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఈ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ కస్టమర్లకు ఆప్టికల్ ఫైబర్‌తో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ అందిస్తుంది. ఈ ప్లాన్ ధర రూ. 999 మాత్రమే. బెనిఫిట్స్ పరంగా చూస్తే దేశమంటా అన్ లిమిటెడ్ కాలింగ్‌ను పొందవచ్చు. అంతేకాదు.. 200Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ పొందవచ్చు. కంపెనీ కస్టమర్ల కోసం 5000GB ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) లిమిట్ కూడా అందిస్తుంది.

ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లో కస్టమర్లకు ఓటీటీ యాప్‌లకు ఫ్రీ యాక్సెస్‌ కూడా అందించింది. ఈ ప్లాన్ జియో హాట్‌స్టార్, హంగామా OTT, జీ5, షెమరూ ఓటీటీ సోనీ లైవ్ వంటి ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ డేటా, ఓటీటీ కాలింగ్ బెనిఫిట్స్ నెలవారీ ప్లాన్ కింద ఆఫర్ చేస్తుంది.

Read Also : Lava Bold N2 Price Cut : సూపర్ ఫోన్ భయ్యా.. లావా బోల్డ్ N2 ధర ఇంత తక్కువా.. అమెజాన్‌లో జస్ట్ రూ. 8,999కే

ప్రభుత్వ టెలికాం సంస్థ ఇటీవలే కోట్లాది మంది కస్టమర్ల కోసం ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు సోనీ లివ్, జియో హాట్‌స్టార్ జీ5 అనే 3 OTT యాప్‌లకు కేవలం రూ. 150కే అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు.

ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌గా అందిస్తోంది. ఈ ఆఫర్ బీఎస్ఎన్ఎల్ కొత్త పాత FTTH అంటే.. బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లందరికి వర్తిస్తుంది. ఈ ప్యాక్ ధర రూ. 199 మాత్రమే. ఫ్రీడమ్ ఆఫర్ కింద ఈ ప్యాక్ రూ.150కే లభిస్తుంది.. ధర రూ. 49 తగ్గింది అనమాట.

రూ. 51 స్కీమ్ పొడిగింపు :
బీఎస్ఎన్ఎల్ రూ. 51 ఆఫర్‌ను ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ ప్లాన్ కింద కొత్త కస్టమర్లు కేవలం రూ. 51కే బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ యూజర్లకు పూర్తి నెలకు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, 100 ఫ్రీ SMS అందిస్తుంది. అంతేకాదు.. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ దేశమంతటా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్‌ కూడా అందిస్తుంది.