BSNL Independence Day 2026 : BSNL స్పెషల్ ఫ్రీడమ్ 2.0 ఆఫర్.. రూ.1కే సిమ్.. రోజూ 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్
BSNL Independence Day 2026 : ఇండిపెండెన్స్ డే సందర్భంగా బీఎస్ఎన్ఎల్ టెలికం కంపెనీ బంపర్ ఆఫర్లను ప్రకటించంది. స్పెషల్ ఫ్రీడమ్ 2.0 స్కీమ్ కింద రూ.1కే సిమ్ కార్డును అందిస్తోంది. రోజుకు 1జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చు.
- Sreehari A
- Updated on- August 14, 2026 / 04:09 PM IST
BSNL Independence Day 2026
- BSNL ఫ్రీడమ్ 2.0 పథకం.. 2026 ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్లు
- కొత్త BSNL సిమ్ కార్డు ఇప్పుడు కేవలం రూ. 1కే లభిస్తోంది
- ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు మాత్రమే ఈ ఆఫర్
BSNL Independence Day 2026 : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు పండగే పండగ.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఫ్రీడమ్ 2.0 స్కీమ్ కింద 2026 స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు కేవలం రూ.1కే కొత్త BSNL సిమ్ కార్డును సొంతం చేసుకోవచ్చు.
ఈ ఆఫర్ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు అందుబాటులో ఉంటుంది. కొత్త కస్టమర్లు రోజువారీ డేటా, SMS అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ధరతో లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ టెలికాం కంపెనీ కొత్త బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఆఫర్ కూడా ప్రవేశపెట్టింది. పూర్తి ఆఫర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.
బీఎస్ఎన్ఎల్ రూ. 1 సిమ్ ఆఫర్ :
ఫ్రీడమ్ 2.0 స్కీమ్ కింద కొత్త కస్టమర్లు కేవలం రూ.1కే బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును పొందవచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ కొత్త కనెక్షన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు.
ఆసక్తిగల యూజర్లకు ప్రతిరోజూ 1GB డేటా, 100 SMS కూడా లభిస్తాయి. ఈ బెనిఫిట్స్ 24 రోజుల పాటు పొందవచ్చు. కొత్త సిమ్ కనెక్షన్ లేదా బీఎస్ఎన్ఎల్ సర్వీసు పొందేవారికి ఈ ఆఫర్ అద్భుతంగా ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 రీఛార్జ్ ప్లాన్ :
BSNL మొబైల్ కస్టమర్ల కోసం రూ. 2,399 ప్లాన్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ 412 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2GB మొబైల్ డేటా 100 SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్ :
BSNL కొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త కస్టమర్లు ఫస్ట్ నెల ఈ సర్వీసును ఫ్రీగా పొందవచ్చు. ఆ తర్వాత 3 నెలల పాటు, నెలకు రూ. 100 తగ్గింపు పొందవచ్చు. దాంతో ధర నెలకు రూ. 399 అవుతుంది.
ఐదో నెల నుంచి నెలకు రూ. 499 ధర వర్తిస్తుంది. ఇదిలా ఉండగా, ‘హర్ ఘర్ తిరంగా’ క్యాంపెయిన్‌లో పాల్గొనమని బీఎస్ఎన్ఎల్ ప్రోత్సహిస్తోంది. ‘హర్ ఘర్ తిరంగా’ క్యాంపెయిన్ 2026 ఆగస్టు 17 వరకు కొనసాగుతుంది.
