BSNL Fiber Plan : గుడ్ న్యూస్.. రూ.1099కే 3 నెలల BSNL వై-ఫై, 1400GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. ఎలా బుక్ చేయాలంటే?
BSNL Fiber Plan : బీఎస్ఎన్ఎల్ గ్రామీణ ప్రాంతాల కోసం రూ. 1099 ఫైబర్ వై-ఫై ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 1400GB డేటాతో అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. పూర్తి ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published on- April 21, 2026 / 02:59 PM IST
BSNL Fiber Plan
- రూ. 1099తో 3 నెలల పాటు నెలకు 1400GB డేటా
- 40Mbps స్పీడ్ ల్యాండ్‌లైన్ ద్వారా అన్ లిమిటెడ్ కాల్స్
- 3 నెలల అడ్వాన్స్ పేమెంట్, రూ. 98 క్యాష్‌బ్యాక్ ఆప్షన్
BSNL Fiber Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా వై-ఫై లేదా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును ఎంజాయ్ చేయొచ్చు. బీఎస్ఎన్ఎల్ ప్రత్యేకంగా గ్రామీణ, చిన్న పట్టణాలలోని యూజర్ల కోసం కొత్త సరసమైన వై-ఫై ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
కంపెనీ ప్రకారం.. ఈ ప్లాన్ రూ. 1,099కి 3 నెలల పాటు నెలకు 1,400GB డేటా అన్ లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఫైబర్ కనెక్షన్ అనేది హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ప్రకటించింది. ప్రభుత్వ టెలికం దిగ్గజం ప్రకారం 3 నెలల అడ్వాన్స్ పేమెంట్ చేసే వినియోగదారులకు రూ. 98 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ టెలికాం నెట్‌వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది.
गाँव की तरक्की अब रुकेगी नहीं,
BSNL WiFi के साथ हर घर जुड़ेगा#BSNLIndia #WIFI #villagelife #fiberinternet #Unlimited #CALLS @CMDBSNL @robertravi21 pic.twitter.com/mZC7WZnCn0— BSNL India (@BSNLCorporate) April 19, 2026
40Mbps వరకు స్పీడ్, నెలకు 1400GB డేటా :
ఈ ప్లాన్ వివరాలను పరిశీలిస్తే.. 40Mbps వరకు స్పీడ్‌తో నెలకు 1400GB డేటాను అందిస్తుంది. వినియోగదారులు అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. అయితే, కాలింగ్ సర్వీసు ల్యాండ్‌లైన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ప్రకారం.. ఫైబర్ కనెక్షన్ ద్వారా స్టేబుల్ నెట్‌వర్క్‌తో ఫాస్ట్ ఇంటర్నెట్ పొందవచ్చు.
ఈ ప్లాన్ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల కోసం రూపొందించారు. హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం పరిమితంగా ఉంది. తక్కువ ధరకే ఎక్కువ డేటాను పొందవచ్చు. మీరు ఈ BSNL Wi-Fi కనెక్షన్ కావాలంటే.. అందుకు చాలా మార్గాలు ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా బుక్ చేసుకోవడం.. ఇందులో మీరు లాగిన్ చేసి కొత్త కనెక్షన్ కోసం రిక్వెస్ట్ పెట్టొచ్చు. మీ ప్రాంతంలో లభ్యతను కూడా చెక్ చేయవచ్చు.
వాట్సాప్ ద్వారా కూడా యూజర్లు రిక్వెస్ట్ చేయొచ్చు. 18004444 నంబర్‌కు ‘Hi’ లేదా ‘Book WiFi’ అని టెక్స్ట్ చేస్తే చాలు.. చాట్‌బాట్ అవసరమైన సమాచారాన్ని సేకరించి రిక్వెస్ట్ రిజిస్టర్ చేస్తుంది. మీరు నేరుగా కాల్ చేయడం ద్వారా కూడా కొత్త కనెక్షన్‌ను బుక్ చేసుకోవచ్చు. కస్టమర్ కేర్ మీ ప్రాంతంలో సర్వీసు లభ్యతను చెక్ ప్రాసెస్ చేస్తుంది.
