BSNL 199 Postpaid Plan : BSNL కస్టమర్లకు పండగే.. అత్యంత చౌకైన ప్లాన్ ఇదే.. ధర జస్ట్ రూ.199కే.. ఫుల్ బెనిఫిట్స్..!
BSNL 199 Postpaid Plan : ప్రైవేట్ టెలికం కంపెనీలు పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను రూ. 400 ప్రారంభ ధరతో అందిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ 50 శాతం తక్కువ ధరకే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. పూర్తి ప్లాన్ వివరాలివే..
- Sreehari A
- Published on- July 17, 2026 / 07:25 PM IST
BSNL 199 Postpaid Plan
- బీఎస్ఎన్ఎల్ అత్యంత చౌకైన పోస్టు పెయిడ్ ప్లాన్
- ఈ ప్లాన్ ధర జస్ట్ రూ. 199 మాత్రమే
- ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే 50 శాతం తక్కువ ధరకే
BSNL 199 Postpaid Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ భారత్‌లోనే అత్యంత చౌకైన పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్ అందిస్తోంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్ల ప్రారంభ ధరలు సుమారు రూ. 400 నుంచి ప్రారంభమవుతాయి.
బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు దాదాపు 50శాతం తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ అత్యంత (BSNL 199 Postpaid Plan) చౌకైన పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్ నెలకు రూ. 199కే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ డేటా రోల్‌ఓవర్ బెనిఫిట్ కూడా అందిస్తుంది. పూర్తి ప్లాన్ వివరాలపై ఓసారి లుక్కేయండి.
బీఎస్ఎన్ఎల్ రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
రూ. 199 ధరకు ఈ బీఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 25GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో యాడ్-ఆన్ ఫ్యామిలీ కనెక్షన్ ఉండదు. ఈ ప్లాన్ 75GB వరకు డేటా రోల్‌ఓవర్‌ను అందిస్తుంది. డేటా లిమిట్ దాటాక కంపెనీ ప్రతి MBకి ఒక పైసా చొప్పున ఛార్జ్ చేస్తుంది. వినియోగదారులు 24×7 అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా పొందవచ్చు.
Read Also : E20 Dispute : E-20 కేసులో మారుతీకి ఎదురుదెబ్బ.. కొత్త కారు ఇవ్వాలన్న ఆదేశం! కంపెనీ సవాల్‌కు రెడీ!
టెలికాం టాక్ ప్రకారం.. ఈ రేంజ్ ప్లాన్ మరే ఇతర టెలికాం కంపెనీ పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్ అందించడం లేదు. నెలకు రూ. 199కి, వినియోగదారులు భారీ మొత్తంలో డేటా, ఇతర బెనిఫిట్స్ పొందుతారు. దేశంలోనే చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా ఇదే ధరకు లభిస్తున్నాయి. ఉదాహరణకు.. మీరు రూ. 199కి ఎయిర్‌టెల్ లేదా జియో ప్లాన్ తీసుకున్నా మీకు 25GB డేటా లేదా నెల వ్యాలిడిటీ లభించదు.
జియో రూ.199 ప్లాన్ ఏంటి? :
రూ. 199 ప్లాన్‌కు జియో రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటా, 18 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 27GB డేటా అందుతుంది. ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ ప్లాన్ జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్‌కు ఫ్రీ యాక్సెస్ కూడా అందిస్తుంది.
