×
Ad

BSNL Recharge Plan : BSNL కస్టమర్లకు పండగే.. కొత్త ప్లాన్ అదుర్స్.. 72 రోజుల వ్యాలిడిటీ, 144GB హైస్పీడ్ డేటా.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ లాంగ్ వ్యాలిడిటీతో కొత్త రీఛార్జ్ ప్లాన్ వచ్చింది. ఈ ప్లాన్ బెనిఫిట్స్, డేటా లిమిట్, వ్యాలిడిటీ వివరాలివే..

BSNL Recharge Plan

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్. బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ వచ్చేసింది. పెద్ద మొత్తంలో చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే కస్టమర్లకు (BSNL Recharge Plan) అద్భుతమైన ప్లాన్. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర కేవలం రూ.485 మాత్రమే. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ పొందవచ్చు.

రోజువారీ యూజర్లకు ఈ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది. ఇటీవలే, బీఎస్ఎన్ఎల్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటా లిమిట్, ఇతర బెనిఫిట్స్ సహా రూ.199 రీఛార్జ్ ప్లాన్‌ ప్రవేశపెట్టింది. అదనంగా, టెల్కో అనేక బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ రూ. 485 ప్లాన్ బెనిఫిట్స్ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బీఎస్ఎన్ఎల్ రూ. 485 ప్లాన్ బెనిఫిట్స్, వ్యాలిడిటీ :
బీఎస్ఎన్ఎల్ రూ.485 ప్లాన్ 72 రోజుల వ్యాలిడిటీతో 2GB రోజువారీ డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. వినియోగదారులు మొత్తం 144GB డేటాను పొందవచ్చు. బ్రౌజింగ్, సోషల్ మీడియా, వీడియో కాల్స్ లేదా లైట్ స్ట్రీమింగ్ కోసం వినియోగించుకోవచ్చు.

Read Also : Amazon Great Indian Festival 2025 : అమెజాన్ పండగ సేల్ ఆఫర్లు.. ఈ శాంసంగ్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

వర్క్ లేదా ఎంటర్‌టైన్మెంట్ కోసం మొబైల్ డేటాపై ఆధారపడే వారికి రూ.500 కన్నా తక్కువ ధరలో బెస్ట్ ప్లాన్. డేటా ముగిసిన తర్వాత స్పీడ్ 40 kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో లోకల్, ఎస్టీడీ రెండింటిలోనూ అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అదనంగా, బీఎస్ఎన్ఎల్ యూజర్లు అధికారిక వెబ్‌సైట్ లేదా బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే 2శాతం తగ్గింపును కూడా అందిస్తోంది.

4G స్పీడ్, 5G విస్తరణ విషయానికి వస్తే.. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ టెల్కోల కన్నా వెనుకబడి ఉంది. అయితే, ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ స్పీడ్ కన్నా వాల్యూకు ప్రాధాన్యతనిచ్చే యూజర్లను లక్ష్యంగా అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ ఎక్కువగా వినియోగించే అనేక గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలోని వినియోగదారులకు ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది.