Amazon Great Indian Festival 2025 : అమెజాన్ పండగ సేల్ ఆఫర్లు.. ఈ శాంసంగ్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!
Amazon Great Indian Festival 2025 : అమెజాన్ ఫెస్టివల్ సేల్ సమయంలో శాంసంగ్ స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆపర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి..

Amazon Great Indian Festival 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ అభిమానుల కోసం అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సందర్భంగా వైడ్ రేంజ్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అందులో ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ డీల్స్ అత్యంత ఆకర్షణగా నిలుస్తున్నాయి. మీ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని చూస్తుంటే చాలా తక్కువ ధరకు కొత్త ఫోన్ కొనేందుకు సరైన అవకాశం. అమెజాన్ సేల్ సమయంలో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4400mAh డ్యూయల్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 7.6-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 6.3-అంగుళాల ఔటర్ స్క్రీన్ కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఈ శాంసంగ్ ఫోన్ 10MP కెమెరా కలిగి ఉంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 రూ.1,03,999 తగ్గింపు ధరకు లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 : శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల QHD+ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. హుడ్ కింద, ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. కెమెరాల విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP వైడ్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్,10MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 12MP కెమెరాను కలిగి ఉంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 రూ.74,999 తగ్గింపు ధరకు పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A55 5G : శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కలిగి ఉంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ రూ.23,999 తగ్గింపు ధరకు పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ M36 5G : శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ M36 5Gలో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా ఉంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ M36 5G రూ.13,999 తగ్గింపు ధరకు పొందవచ్చు.