BSNL Rs 51 Recharge Plan : BSNL చీపెస్ట్ ప్లాన్.. జస్ట్ రూ. 51కే 56GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఈ తేదీ వరకే..!

BSNL Rs 51 Recharge Plan: బీఎస్ఎన్ఎల్ రూ. 51 రీఛార్జ్ ప్లాన్ సరసమైన ధరకే 56GB హై-స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. వ్యాలిడిటీ బెనిఫిట్స్ పొందాలంటే ఇదే లాస్ట్ ఛాన్స్.. ఎలా ప్లాన్ పొందాలో చూద్దాం..

BSNL Rs 51 Recharge Plan

  • బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం కొత్త రూ. 51 ప్రీపెయిడ్ ప్లాన్
  • డేటా, కాలింగ్, SMS బెనిఫిట్స్, ఫ్రీ సిమ్ కార్డు కూడా
  • ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ జూన్ 30, 2026 వరకు మాత్రమే

BSNL Rs 51 Recharge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ప్లాన్.. కేవలం రూ. 51తో రీఛార్జ్ చేసుకుంటే అద్భుతమైన కాలింగ్ బెనిఫిట్స్, ఫ్రీ సిమ్ కార్డు కూడా పొందవచ్చు. కొత్త యూజర్లను ఆకర్షించేందుకు ఇటీవలే రూ. 51 బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, SMS బెనిఫిట్స్ అందిస్తుంది.

కొత్త కస్టమర్లు రీఛార్జ్‌ మాత్రమే కాదు.. ఫ్రీ సిమ్ కార్డు కూడా పొందవచ్చు. మీరు ఫస్ట్ టైమ్ బీఎస్ఎన్ఎల్‌కు (BSNL Rs 51 Recharge Plan) మారాలని చూస్తున్నా లేదా సెకండ్ మొబైల్ సిమ్ కావాలాన్నా ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. ఈ ప్లాన్ బెనిఫిట్స్, వ్యాలిడిటీ, ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Motorola Edge 70 Pro Plus : మోటోరోలా లవర్స్ మీకోసమే.. ఈ కొత్త మోటోరోలా 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

బీఎస్ఎన్ఎల్ బెనిఫిట్స్, వ్యాలిడిటీ :
బీఎస్ఎన్ఎల్ రూ. 51 రీఛార్జ్ ప్లాన్ యూజర్లకు 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. సెకండరీ సిమ్ వాడేవారికి బెస్ట్ ప్లాన్. ఈ ప్యాకేజీలో భాగంగా సబ్‌స్క్రైబర్‌లకు రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా వస్తాయి.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ ఎంచుకునే యూజర్లు లోకల్ STD కాల్స్ చేసుకోవచ్చు. అలాగే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, రోజుకు 2GB డేటా బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ అనేది ఫస్ట్ టైమ్ బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో చేరే యూజర్లకు ఫ్రీ సిమ్‌ బెనిఫిట్ ఉంటుంది.

రూ. 51 ప్రీపెయిడ్ ప్లాన్‌ ఎలా పొందాలి? :
బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్లు లేదా ఇతర రిటైలర్ల ద్వారా ఫ్రీ సిమ్ తో పాటు రీఛార్జ్ ప్లాన్ కూడా పొందవచ్చు. BSNL సిమ్‌ యాక్టివేట్ కోసం ఐడెంటిటీ డాక్యుమెంట్లతో పాటు అడ్రస్ ప్రూఫ్ కూడా తీసుకురావాలి. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే ఉంటుంది. ఆఫర్ వ్యాలిడిటీకి సంబంధించి మీకు దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ సిమ్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.