BSNL Special Offer : BSNL స్పెషల్ ఆఫర్.. ఈ 3 రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గింపు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!
BSNL Special Offer : బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. మదర్స్ డే సందర్భంగా రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా తగ్గించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

BSNL Flash Sale
BSNL Special Offer : మదర్స్ డే సందర్భంగా బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌లలో 3 ప్లాన్ల ధరలను తగ్గించింది.
బీఎస్ఎన్ఎల్ నుంచి ఈ ఆఫర్ మే 7 నుంచి మే 14 వరకు రీఛార్జ్ చేసుకునే యూజర్లకు అందుబాటులో ఉంటుంది. BSNL మూడు రీఛార్జ్ రూ. 2399, రూ. 997, రూ. 599 ప్లాన్‌లపై 5 శాతం తగ్గింపును అందిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ లేదా సెల్ఫ్-కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకునే యూజర్లు ఈ డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 2399 ప్లాన్ ధర రూ. 2279కి తగ్గుతుంది.
రూ. 997 ప్లాన్ ధర కేవలం రూ. 947 కాగా, 599 ప్లాన్ ధర రూ. 569కి లభిస్తుంది. వినియోగదారులు ఈ మూడు ప్లాన్లపై మొత్తంగా రూ. 120 వరకు సేవ్ చేసుకోవచ్చు.
BSNL రూ. 2399 ప్లాన్ :
ఈ ప్లాన్ 395 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అనేక ఆకర్షణీయమైన బెనిఫిట్స్‌తో వస్తుంది. వినియోగదారులు భారత్ అంతటా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, 100 ఫ్రీ SMS పొందవచ్చు.
ఇంకా, BSNL అన్ని ప్లాన్‌లలో BiTVకి ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తుంది. వినియోగదారులు మొబైల్‌లలో 350 కన్నా ఎక్కువ లైవ్ టీవీ ఛానల్స్ చూడొచ్చు.
BSNL రూ. 997 ప్లాన్ :
160 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ వినియోగదారులకు భారత్ అంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. రూ. 2399 ప్లాన్ మాదిరిగానే సబ్‌స్క్రైబర్‌లు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, 100 ఫ్రీ SMS పొందవచ్చు. అలాగే BiTVకి ఫ్రీ యాక్సెస్‌ను పొందుతారు.
BSNL రూ. 599 ప్లాన్ :
ఈ ప్లాన్ వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. భారత్ అంతటా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 3GB హై-స్పీడ్ డేటా, 100 ఫ్రీ SMS ఉన్నాయి.
ఇతర ప్లాన్‌ల మాదిరిగానే BiTVకి ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ మాతృ దినోత్సవం రోజున వినియోగదారులు BSNL అందించే ఆఫర్‌లను పొందవచ్చు.