×
Ad

BSNL VoWiFi Service : BSNL యూజర్లకు పండగే.. కొత్త VoWiFi సర్వీసు ఆగయా.. ఇకపై నెట్‌వర్క్‌తో పనిలేదు.. ఈజీగా కాల్స్ చేసుకోవచ్చు!

BSNL VoWiFi Service : బీఎస్ఎన్ఎల్ సరికొత్త VoWiFI సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసు ద్వారా కస్టమర్లు మొబైల్ నెంబర్ నెట్ వర్క్ లేకున్నా కూడా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

BSNL VoWiFi Service

BSNL VoWiFi Service : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మొబైల్ నెట్‌వర్క్ లేకుండానే వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ప్రభుత్వం నేతృత్వంలోని టెలికాం కంపెనీ ఎంపిక చేసిన ప్రాంతాలలో VoWiFi (వాయిస్ ఓవర్ Wi-Fi) సర్వీసును ప్రారంభించింది. వినియోగదారులు సెల్యులార్ నెట్‌వర్క్‌కు బదులుగా Wi-Fi కనెక్షన్‌ని ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ప్లేయర్‌లతో పోటీగా ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ టెలికం దిగ్గజాలు తమ వినియోగదారులకు Wi-Fi కాలింగ్‌ను సర్వీసును అందిస్తున్నాయి. లేటెస్ట్‌గా బీఎస్ఎన్ఎల్ కూడా వాయిస్ ఓవర్ వై-ఫై సర్వీసును అందిస్తోంది. ఈ సర్వీసు ద్వారా మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో ఈజీగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ విస్తరణ :
బీఎస్ఎన్ఎల్ ఇటీవలే దేశవ్యాప్తంగా లక్షకు పైగా మొబైల్ టవర్ల ఏర్పాటుతో 4G సర్వీసులను ప్రారంభించింది. దాదాపు 97,500 కొత్త టవర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. VoWiFi సర్వీసు ప్రారంభంతో బీఎస్ఎన్ఎల్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో మరో మైలురాయిని చేరుకుంది. ఈ సర్వీసును అక్టోబర్ 2న టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) కార్యదర్శి నీరజ్ మిట్టల్ సాఫ్ట్-లాంచ్ చేశారు.

Read Also : Apple MacBook Air 2025 : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌పై అద్భుతమైన డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

ప్రస్తుతం (VoWiFi) ఫీచర్ సౌత్,వెస్ట్ జోన్ సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. కానీ, బీఎస్ఎన్ఎల్ త్వరలో ఇతర ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తోంది. అదనంగా, తమిళనాడులో గతంలో eSIMని ప్రవేశపెట్టిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు 4G, eSIM సర్వీసులను ముంబైలో కూడా ప్రారంభించింది.

బీఎస్ఎన్ఎల్ VoWiFi ఎలా పని చేస్తుందంటే? :
VoWiFi సర్వీసు ద్వారా వినియోగదారులు మొబైల్ సిగ్నల్స్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో Wi-Fi లేదా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ ద్వారా క్రిస్టల్-క్లియర్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇండోర్ లేదా తక్కువ నెట్‌వర్క్ జోన్‌లలో నివసించే ప్రజలకు ప్రత్యేకంగా ఉంటుంది. అయితే, వినియోగదారులకు VoWiFiకి సపోర్టు ఇచ్చే స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి. కొత్త ఆండ్రాయిడ్, ఐఫోన్ మోడల్స్ ఇప్పటికే సెట్టింగ్స్ మెనూలో ఈ సర్వీసు ఆప్షన్ కలిగి ఉన్నాయి.

అన్ని బీఎస్ఎన్ఎల్ యూజర్లకు ఉచితం :
బీఎస్ఎన్ఎల్ VoWiFi సర్వీసు పూర్తిగా ఉచితం. Wi-Fi ద్వారా కాల్స్ చేసేందుకు వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. బీఎస్ఎన్ఎల్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా ధృవీకరించింది. ఈ సర్వీసు ద్వారా మరింత యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అదనపు ఖర్చు లేకుండా కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

ప్రైవేట్ సంస్థలతో పోటీగా బీఎస్ఎన్ఎల్ :
బీఎస్ఎన్ఎల్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లకు పోటీగా VoWiFi సర్వీసు ప్రారంభించింది. మెరుగైన కస్టమర్ కోసం నెట్‌వర్క్, సర్వీసులను అప్‌గ్రేడ్ చేస్తోంది. భారతీయ టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ మరింత పుంజుకుంటుందని భావిస్తున్నారు.